Rajyasabha డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌.

17:22:00 | 09-Aug-2018
1555    0

న్యూఢిల్లీ:

ఎంతో రసవత్తరంగా జరిగిన rajyasabha  ఉపసభాపతి ఎన్నికలో ఎన్డీయేనే విజయం సాధించింది.

ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన జేడీయూ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ rajyasabha  డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

ప్రతిపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ ఓటమి పాలయ్యారు.

డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 230 మంది సభ్యులు ఓటు వేశారు.

అందులో ఎన్డీయే కూటమి అభ్యర్థి హరివంశ్‌కు 125 ఓట్లు రాగా.. విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి.

కౌంటింగ్ పూర్తయిన అనంతరం ఇద్దరు అభ్యర్థులకు పోలైన ఓట్లను బట్టి హరివంశ్ విజయం సాధించినట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఇద్దరు సభ్యులు సభకు వచ్చి, ఓటు వేయకుండా తటస్థ వైఖరిని అవలంభించారు.

టీడీపీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు ఓటేశారు.

ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించిన టీఆర్ఎస్ సభ్యులు ఆఖరి క్షణంలో మనసు మార్చుకుని ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేశారు.

భారత పార్లమెంటు వ్యవస్థలో 26 ఏళ్లుగా రాజ్యసభ ఉపసభాపతి ఏకగ్రీవంగా జరిగింది.

అయితే 26 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఎన్నికలో జేడీయూ ఎంపీ హరివంశ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

1956 జూన్‌ 30న జన్మించిన హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ రాంచీలోని బనారస్ యూనివర్శిటీ నుంచి పట్టభద్రులయ్యారు.

Tags :

Releted News

ఒకే కుటంబానికి చెందిన 6 గురు ఆత్మహత్య

12:40:00 | 15-Jul-2018
1555    0

జార్ఖండ్:  ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ విషాద సంఘటన జార్ఖండ్‌లోని హజారిబాగ్ జిల్లాలో నిన్న రాత్రి చోటుచేసుకుంది. వీరిలో ఐదుగురు వ్యక్తులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా మరొక వ్యక్తి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు.  డ్రై ఫ్రూట్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు, విపరీత అప్పులతో తీవ్ర...

ఆర్టీసీ కార్మికులకు సీఎం శుభవార్త

12:47:00 | 15-Jul-2018
1555    0

  విజయవాడ: ఏపీ ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు 19 శాతం ఐఆర్‌ ప్రకటించారు. దీంతో 54 వేల మంది ఆర్టీసీ కార్మికులు లబ్ధి పొందనున్నారు. దీనివల్ల ఆర్టీసీపై నెలకు రూ.249 కోట్ల భారం పడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతైనా భరిస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ...

మంజీరా నదిలో చిరుత మృతదేహం

12:00:00 | 15-Jul-2018
1555    0

మంజీరా నదిలో చిరుత మృతదేహం సంగారెడ్డి: మంజీరా నదిలో చిరుతపులి మృతదేహం కొట్టుకురావడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట పరిధిలోని సింగూర్ జలాశయంలో నీటిలో తేలుతున్న చిరుత పులి మృతదేహాన్ని పశువుల కాపర్లు గుర్తించారు. వారి సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తరలించారు. సింగూరుకు ఎగువ రాష్ట్ర పరిధిలో రిజర్వ్...

తగ్గుతు వస్తున్న గోదావరి వరద

09:30:00 | 15-Jul-2018
1555    0

  భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం పెరుగుతు, తగ్గుతు వస్తోంది. గత నాలుగు రోజులుగా 26 అడుగుల నుంచి 31 అడుగుల మధ్య ప్రవహిస్తోంది. వరద నీరు గోదావరి స్నానఘట్టాలవరకు చేరుకుని ప్రవహిస్తోంది. వరద ఉద్రిక్తతవల్ల ఇప్పటి వరకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. రైతులకు ఉపయోగపడేలా నదీప్రవాహం కొనసాగుతోంది. వరద ఉధృతి ఎక్కువైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార్లతో సమీక్షా...

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి జోగు

12:00:00 | 15-Jul-2018
1555    0

  ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో స్వచ్చ పక్వాడా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతపై మంత్రి జోగురామన్న విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ..స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకువచ్చినా.. ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయం సాధించలేమని, అందుకే ప్రభుత్వం ప్రజలు కలిసి శ్రమిస్తేనే పథకాల...

నవీన్ జిందాల్‌పై ఈడీ చార్జిషీటు

12:39:00 | 15-Jul-2018
1555    0

  బొగ్గు గని కేసులో మరో 14 మందిపైనా నమోదు న్యూఢిల్లీ, జూలై 14: ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటును దాఖలు చేసింది. ఈ కాంగ్రెస్ నేతతోపాటు మరో 14 మందిపైనా నమోదు చేసింది. జార్ఖండ్ బొగ్గు గని కేటాయింపులో అక్రమాలకు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ శుక్రవారం ఈ చార్జిషీటును ఫైల్ చేసింది. జిందాల్‌తోపాటు ఆయనకు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్...

గౌతమి ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

09:37:00 | 15-Jul-2018
1555    0

  గౌతమి ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ప్రమాదం కాజీపేట సమీపంలో రైలుపై తెగిపడిన విద్యుత్‌ తీగలు కాజిపేట: వరంగల్‌ అర్బన్‌ జిల్లా దర్గా కాజీపేట రైల్వేగేటు, కాజీపేట రైల్వే స్టేషన్‌ మధ్య విద్యుత్‌ తీగలు(ఓహెచ్‌ఈ) తెగి రైలు పట్టాలపై పడ్డాయి. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగలు తెగి...

పశ్చాతాపపడ్డ భలేదొంగ...ఎక్కడ ఏమా కథ

14:30:00 | 15-Jul-2018
1555    0

వామ్మో ఈ మధ్య దొంగలు కూడా పశ్చాతాప పడుతున్నారు. వాళ్లకు కూడా మానవత్వం ఉందని నిరూపిస్తున్నారు. అందరు దొంగలు ఒకలా ఉండరని నిరూపించాడు ఈ మంచి దొంగ. అందరి దొంగల్లో ఈ దొంగ వేరయ్య అన్నట్లు ఉంది ఈ ఘటన. అసలేంజరిగిందంటే..కేరళలోని అంబలపుజ సమీపంలోని థకుజి అనే గ్రామంలోని ఓ ఇంట్లో ఒక దొంగ బంగారం దొంగతనం చేశాడు. ఫ్యామిలీ అంతా బంధువుల పెండ్లికి వెళ్లడంతో మనోడు తిన్నగా ఇంట్లోకి దూరి లాకర్ ఓపెన్ చేసి ఓ ఫింగర్ రింగ్, ఇయర్...

సీఎం కేసీఆర్ ను కలవనున్న ఏపీ టీడీపీ ఎంపీలు...

13:23:00 | 15-Jul-2018
1555    0

  హైదరాబాద్‌ : ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల నేతలను టీడీపీ ఎంపీలు కలిసి వివరించనున్నారు. నేడు, రేపు పలు పార్టీల అధినేతలను టీడీపీ ఎంపీలు కలవనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్ తదితరులు కలవనున్నట్టు సమాచారం. చంద్రబాబు రాసిన లేఖతో పాటు విభజన హామీల అమలులో వైఫల్యాలపై రాసిన పుస్తకాన్ని కేసీఆర్ కు...

కె ల్ రావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

10:44:00 | 15-Jul-2018
1555    0

  అమరావతి: కేఎల్ రావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి, కర్తవ్యదీక్ష, ధృడ సంకల్పం, సేవానిరతిలకు కే.ఎల్.రావు నిదర్శనం : ముఖ్యమంత్రి నిస్వార్థంతో విధ్యుధర్మాన్ని నిర్వర్తించిన కొద్ది మంది ఇంజనీర్లలో అగ్రగణ్యులు కే.ఎల్.రావు : ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు 1950-60లలో దేశంలోని అన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ పథకాలలో ఆయన మేధో ముద్ర ఉంది :...

ఐదుగురు చైన్ స్నాచర్ల అరెస్టు

14:26:00 | 14-Jul-2018
1555    0

  నాగర్‌కర్నూల్ క్రైం : మహిళలను టార్గెట్ చేస్తూ వారి ఒంటిమీద బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఐదుగురు దొం గల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ముఠా నుంచి 30 తు లాల బంగారం, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం...

ప్రకాశం బ్యారేజీ 4 గేట్లు ఎత్తివేత

11:45:00 | 14-Jul-2018
1555    0

  విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు శనివారం బ్యారేజీ నాలుగు గేట్లను ఎత్తివేసి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉంది. తూర్పు డెల్టాకు 8 వేల క్యూసెక్కుల నీటిని, పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో వాగులు...

< 4 5 6 7 8 9 10 11 12 >