9200 పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్

19:06:00 | 25-Jul-2018
1555    0

 

. సెప్టెంబర్ రెండో వారంలో పరీక్ష
. పరీక్ష నిర్వహణ ప్రభుత్వ సంస్ధలదే
. కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు 9200 మంది పంచాయతీ కార్యదర్శులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నియామకాలను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నియామకాలను ఏ పద్ధతిలో చేపట్టాలనే అంశంపై అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా 9200మంది పంచాయతీ కార్యదర్శులను నియమించేందుకు తీసుకోవల్సిన జాగ్రతలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వారం రోజుల్లోగా జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 31లోగా నోటిఫికేషన్‌ను జారీ చేసి, సెప్టెంబర్ నెల రెండో వారంలో రాత పరీక్షను నిర్వహించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. రాత పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? లేదా మ్యాన్వల్‌గా నిర్వహించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎట్టకేలకు రాత పరీక్షను నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెరిట్ పద్దతి వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 9200 పోస్టులకు సూమారు 5లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ పోస్టులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉండాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో డిగ్రీలో ఇంజనీరింగు, అగ్రికల్చర్, తదితర కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయా కోర్సుల్లో మార్కుల జాబితాలు వేర్వేరుగా ఉన్నాయి. పైగా కొన్ని యూనివర్శిటీలు గ్రేడులను ఇస్తుంది. దీంతో వీటిని మెరిట్ ప్రాతిపదికనా తీయడం కష్టమేనని అధికారులు నిర్ధారించారు. ఈ సమస్యలను పూర్తిగా అధిగమించాలంటే రాతపరీక్షయే ఉత్తమమని తేల్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయానికి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనున్నది. రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, జేఎన్‌టీయూలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

ప్రభుత్వ సంస్థలకే రాత పరీక్షను అప్పగించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కానీ పోస్టుల భర్తీ ప్రక్రియను అయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించనున్నారు. దీంతో ప్రక్రియను సజావుగా చేపట్టాలని పంచాయతీరాజ్‌శాఖ యోచిస్తున్నది. ఇదిలా ఉండగా పంచాయతీ కార్యదర్శుల విధి, విధానాలను కూడా నిబంధనల్లో రూపొందించారు. ప్రధానంగా అయా గ్రామాల్లోనే కార్యదర్శులు తప్పకుండా బస చేసే విధంగా నిబంధనల్లో పేర్కొన్నారు. గ్రామాల్లోని ఇంటి పన్ను వసూలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధీ ద్వీపాలు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు, ఆసరా పింఛన్ల పంపిణీ, రైతు బంధు పథకం, వైద్య ఆరోగ్యం, పశు సంవర్ధకశాఖ, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు తదితర అంశాలను పంచాయతీ కార్యదర్శి చూసుకునే విధంగా నిబంధనల్లో పొందుపర్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 8695 గ్రామ పంచాయతీలతో పాటు, నూతనంగా ఏర్పాటైన 4056 గ్రామ పంచాయతీల్లోనూ కార్యదర్శులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పైగా ప్రస్తుతం 3551 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరికి 4 గ్రామ పంచాయతీలను అప్పగించింది. దీంతో గ్రామాభివృద్ధికి కొంత ఆటంకం కూడా కల్గుతున్నదని ప్రభుత్వం భావించి భారీస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని తెలిసింది. దీంతో ఈ భర్తీ ప్రక్రియను కూడా పకడ్భందిగా నిర్వహించాలని నిరుద్యోగులు కూడా అభిప్రాయపడుతున్నారు

Tags :

Releted News

Sbi లో ఉద్యోగుల నియామకం...చివరి తేదీ ఫిబ్రవరి 4

21:38:00 | 17-Jan-2018
1555    0

ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్: 121 పోస్టులకు అప్లై చేస్కోండి హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 121 ఉద్యోగాల్లో.. 16 మేనేజర్ పోస్టులు, 24 చీఫ్ మేనేజర్ పోస్టులు.. ఇంకా వివిధ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 16 జనవరి 2018 నుంచి 04 ఫిబ్రవరి 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ పేరు : మేనేజర్, చీఫ్ మేనేజర్ ఖాళీల...

9వేల కానిస్టేబుల్ నియామకం..జనతా మిర్రర్ కెరీర్ లో చూడండి

16:38:00 | 04-Jan-2018
1555    0

   -నోటిఫికేషన్ విడుదల చేసిన పోలీస్‌శాఖ -సివిల్ విభాగంలో 1810 కానిస్టేబుల్ పోస్టులు -ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు -ఎస్‌ఏఆర్సీపీఎల్‌లో 56, టీఎస్‌ఎస్పీలో 4065 -ఎస్పీఎఫ్‌లో 174, ఫైర్‌లో 416 పోస్టుల భర్తీ -ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు -ఏప్రిల్ 3న ప్రిలిమినరీ పరీక్ష భారీ సంఖ్యలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. పోలీస్ నియామకాలు భారీ స్థాయిలో చేపడ్తామని సీఎం కే...

తెలంగాణలో ఫిబ్రవరి 04 నుంచి ఆర్మీ సెలక్షన్లు

16:41:00 | 21-Dec-2017
1555    0

2018 ఫిబ్రవరి నెలలో 04 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు *కొత్తగూడెం*(ఖమ్మం జిల్లా)లోని *ప్రకాశం స్టేడియంలో*ఆర్మీ సెలక్షన్లు ఉన్నాయి. *పోస్టులు - రకాలు* 1.సోల్జర్ టెక్నీకల్ 2.సోల్జర్ జనరల్ డ్యూటీ 3.సోల్జర్ ట్రేడ్ మెన్ 4.సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ 5.సోల్జర్ క్లర్కు/స్టోర్ కీపర్ *దరఖాస్తు తేదీలు* ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి. *ఆన్ లైన్ ప్రారంభ తేదీ 21-డిసెంబర్ - 2017* *ఆన్ లైన్ చివరి తేదీ 20 జనవరి 2018* *Admit card:*20-January-2018 *వయస్సు* 17సంవత్సరంల...

ఎల్ ఐ సి లో ఉద్యోగాలు

12:01:00 | 20-Dec-2017
1555    0

ఎల్ఐసీలో 700 ఏఏఓ పోస్టులు * విద్యార్హత డిగ్రీ * మార్చిలో ప‌రీక్షలు * ఎంపికైతే రూ.40 వేల వేత‌నం డిగ్రీ అర్హత‌తో ఉన్న మేటి ఉద్యోగాల్లో ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ఏఏవో) చెప్పుకోద‌గ్గది . ఈ పోస్టుకు ఎంపికైతే త‌క్కువ వ‌య‌సులోనే హోదా, ఆక‌ర్షణీయ వేత‌నం రెండూ సొంతమ‌వుతాయి. బ్యాంకు ప‌రీక్షలు ల‌క్ష్యంగా పెట్టుకున్నవాళ్లు ఏఏవో కోసం ప్రయత్నించ‌వ‌చ్చు. ఈ రెండు ప‌రీక్షల సిల‌బ‌స్...

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త 

16:00:00 | 06-Dec-2017
1555    0

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు సచివాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 2018...

< 1 2 3 4 5 >