9200 పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్

19:06:00 | 25-Jul-2018
1555    0

 

. సెప్టెంబర్ రెండో వారంలో పరీక్ష
. పరీక్ష నిర్వహణ ప్రభుత్వ సంస్ధలదే
. కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు 9200 మంది పంచాయతీ కార్యదర్శులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నియామకాలను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నియామకాలను ఏ పద్ధతిలో చేపట్టాలనే అంశంపై అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా 9200మంది పంచాయతీ కార్యదర్శులను నియమించేందుకు తీసుకోవల్సిన జాగ్రతలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వారం రోజుల్లోగా జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 31లోగా నోటిఫికేషన్‌ను జారీ చేసి, సెప్టెంబర్ నెల రెండో వారంలో రాత పరీక్షను నిర్వహించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. రాత పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? లేదా మ్యాన్వల్‌గా నిర్వహించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎట్టకేలకు రాత పరీక్షను నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెరిట్ పద్దతి వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 9200 పోస్టులకు సూమారు 5లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ పోస్టులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉండాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో డిగ్రీలో ఇంజనీరింగు, అగ్రికల్చర్, తదితర కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయా కోర్సుల్లో మార్కుల జాబితాలు వేర్వేరుగా ఉన్నాయి. పైగా కొన్ని యూనివర్శిటీలు గ్రేడులను ఇస్తుంది. దీంతో వీటిని మెరిట్ ప్రాతిపదికనా తీయడం కష్టమేనని అధికారులు నిర్ధారించారు. ఈ సమస్యలను పూర్తిగా అధిగమించాలంటే రాతపరీక్షయే ఉత్తమమని తేల్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయానికి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనున్నది. రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, జేఎన్‌టీయూలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

ప్రభుత్వ సంస్థలకే రాత పరీక్షను అప్పగించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కానీ పోస్టుల భర్తీ ప్రక్రియను అయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించనున్నారు. దీంతో ప్రక్రియను సజావుగా చేపట్టాలని పంచాయతీరాజ్‌శాఖ యోచిస్తున్నది. ఇదిలా ఉండగా పంచాయతీ కార్యదర్శుల విధి, విధానాలను కూడా నిబంధనల్లో రూపొందించారు. ప్రధానంగా అయా గ్రామాల్లోనే కార్యదర్శులు తప్పకుండా బస చేసే విధంగా నిబంధనల్లో పేర్కొన్నారు. గ్రామాల్లోని ఇంటి పన్ను వసూలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధీ ద్వీపాలు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు, ఆసరా పింఛన్ల పంపిణీ, రైతు బంధు పథకం, వైద్య ఆరోగ్యం, పశు సంవర్ధకశాఖ, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు తదితర అంశాలను పంచాయతీ కార్యదర్శి చూసుకునే విధంగా నిబంధనల్లో పొందుపర్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 8695 గ్రామ పంచాయతీలతో పాటు, నూతనంగా ఏర్పాటైన 4056 గ్రామ పంచాయతీల్లోనూ కార్యదర్శులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పైగా ప్రస్తుతం 3551 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరికి 4 గ్రామ పంచాయతీలను అప్పగించింది. దీంతో గ్రామాభివృద్ధికి కొంత ఆటంకం కూడా కల్గుతున్నదని ప్రభుత్వం భావించి భారీస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని తెలిసింది. దీంతో ఈ భర్తీ ప్రక్రియను కూడా పకడ్భందిగా నిర్వహించాలని నిరుద్యోగులు కూడా అభిప్రాయపడుతున్నారు

Tags :

Releted News

రాజధాని అమరావతిలో 78,700 ఉద్యోగాలు

09:33:00 | 28-Feb-2018
1555    0

అమరావతి కోసం 37 సంస్థలతో సీఆర్డీయే ఎంవోయూలు వాటి మొత్తం విలువ రూ.49,800 కోట్లు అవి సృష్టించే ఉద్యోగాలు 78,700 రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోనున్న సుప్రసిద్ధ కంపెనీలు అమరావతి(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ముగిసిన భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. ఈ ప్రపంచస్థాయి రాజధాని నగర నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశ, విదేశాలకు చెందిన ఎన్నెన్నో సుప్రసిద్ధ సంస్థలు ముందుకు...

ఉద్యోగ అవకాశాలు...హెచ్‌సిఎల్‌లో 5 వేల మందికి ఉద్యోగాలు

16:00:00 | 23-Feb-2018
1555    0

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ ధిగ్గజం హెచ్‌సిఎల్ కొత్తగా 5 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ రంగం మందకొడిగా ఉన్న తరుణంలో హెచ్‌సిఎల్ టెక్కీలకు తీపికబురును అందించింది. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద సుమారు 160...

ఉద్యోగఅవకాశాలు....పోలీస్ శాఖలో 6000 ఉద్యోగాలు

06:50:00 | 20-Feb-2018
1555    0

  ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్‌ శాఖలో త్వరలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తా మని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం అనంతపురంలో హోంమంత్రి మాట్లడుతూ. రాష్ట్ర విభజన నేపథ్యంలో 15 వేల మంది పోలీసు కానిస్టేబుళ్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6 వేల మంది పోలీసు శిక్షణ లో ఉన్నారని, త్వరలో మరో 6 వేల...

ఉద్యోగ అవకాశాలు....హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు

09:08:00 | 14-Feb-2018
1555    0

219 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల:  హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్(బీసీ సంక్షేమ శాఖ) ఆఫీసర్స్ గ్రేడ్-II 219 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టు పేరు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఖాళీల సంఖ్య: 219 జాబ్ లొకేషన్: తెలంగాణ చివరి తేదీ:...

ఉద్యోగ అవకాశాలు... రైల్వేశాఖలో 62,907 పోస్టులు

15:00:00 | 10-Feb-2018
1555    0

న్యూఢిల్లీ: మొన్నటికి మొన్న 26,502 టెక్నీషియన్, అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన రైల్వే.. తాజాగా మరో 62,907 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తద్వారా వేయి కళ్లతో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు శుభవార్తనిచ్చింది. గ్రూప్ డీ పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియను ప్రారంభించింది. అందుకు అనుగుణంగా ప్రాంతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు 'సీఈఎన్ 02/2018' పేరిట తమ...

ఉద్యోగ అవకాశాలు...జూనియర్‌ లెక్చరర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

16:00:00 | 07-Feb-2018
1555    0

టిటిడి ఆధ్వర్యంలోని కళాశాలలు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ లెక్చరర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన టిటిడి రెగ్యులర్‌ ఉద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఉద్యోగులు మూడేళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 11 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులున్నాయి. దరఖాస్తుదారులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో...

ఉద్యోగ అవకాశాలు....రైల్వేశాఖలో 26500 ఉద్యోగులు

08:55:00 | 05-Feb-2018
1555    0

  రైల్వేలో 26,502 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల  సాంకేతిక కోర్సులు అభ్యసించి ఉద్యోగ ప్రకటనల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కల తీరనుంది. రైల్వేశాఖ భారీగా అసిస్టెంట్‌ లోకో పైలట్‌‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏప్రిల్‌, మే నెలల్లో పరీక్షలు జరగనున్నాయి. యువత పట్టుబడితే కేంద్రప్రభుత్వ ఉద్యోగం అందుకోవచ్చు. కేంద్రప్రభుత్వం విడుదల చేసే ప్రకటనల కోసం...

ఉద్యోగ అవకాశాలు...ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

02:00:00 | 05-Feb-2018
1555    0

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త........ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.... ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ పోస్ట్ లు.... యువతి/యువకులకు IAF లో ఆఫీసుర్లు గా చేరుటకు సువర్ణ అవకాశం  Posts:- Officers-Flying అర్హత:-Any Degree/BTech Posts:- Ground Duty-Ad అర్హత:-Any DEGREE Posts:- Ground Duty-Log అర్హత:-Any DEGREE Posts:- Ground Duty-Acc అర్హత:-B-Com  Posts:- Ground Duty-Ed అర్హత:- Any PG/ M.A, MSc, MBA, MCA డిగ్రీ /పిజి విద్యార్థులు. / ఫైనల్ ఇయర్ విద్యార్థులు 01-07-2018 లోపు విద్యాఅర్హతలు పూర్తి చేయువారు కూడా అప్లై చేయవచ్చు...... జీత...

ఉద్యోగ అవకాశాలు...నిరుద్యోగులకు శుభవార్త....రైల్వేశాఖలో ఉద్యోగాలు

07:40:00 | 04-Feb-2018
1555    0

రైల్వే ఉద్యోగార్థులకు శుభవార్త! న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగార్థులకు శుభవార్త. భారత రైల్వే సీఈఎన్ 01/2018తో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నిషియన్ పోస్టుల కోసం 21 రైల్వే రిక్ర్యూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ)లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నిషియన్ పోస్టుల్లో మొత్తం 26502 ఖాళీలు ఉన్నాయి. అందులో అసిస్టెంట్ లోకో పైలట్లకు 17,673 ఖాళీలు ఉండగా, టెక్నిషియన్...

ఉద్యోగ అవకాశాలు...సాంఘిక సంక్షేమ గురుకులలో

08:10:00 | 04-Feb-2018
1555    0

గురుకులాల్లో 549 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి హైదరాబాద్ : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 549 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 418 టీజీటీ, 52 పీజీటీ, 22 పీఈటీ, 10 జూనియర్ లెక్చరర్ సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. హోంశాఖలో 14,177 పోలీసు ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన...

14000 పోస్టులకు గ్రీన్ సిగ్నల్...భారీ నియామకాలు

08:58:00 | 03-Feb-2018
1555    0

  త్వరలో భారీగా కానిస్టేబుళ్ల నియామకం ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు ఆమోదం 8 వేలు సివిల్, 3 వేలు ఆర్మ్‌డ్, 3 వేల స్పెషల్‌ పోలీస్‌ పోస్టులు ఒకేసారి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు పోలీస్‌ శాఖ సన్నాహాలు హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో భారీ ఎత్తున కానిస్టేబుళ్ల నియామకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇటీవలే పంపిన...

ఉద్యోగ మేళ

06:18:00 | 21-Jan-2018
1555    0

హైదరాబాద్: మానవ వనరుల సంస్థ హెచ్‌ఆర్ స్కేర్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హానర్ ల్యాబ్స్ సంస్థలు సంయుక్తంగా ఆదివారం మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఆర్ స్కేర్ సంస్థ సీనియర్ మేనేజర్ అనిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ,బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. వివరాలకు 9182562012, 040-66666789 నెంబర్లల్లో సంప్రదించవచ్చని అనిత సూచించారు.

< 1 2 3 4 5 >