9200 పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్

19:06:00 | 25-Jul-2018
1555    0

 

. సెప్టెంబర్ రెండో వారంలో పరీక్ష
. పరీక్ష నిర్వహణ ప్రభుత్వ సంస్ధలదే
. కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు 9200 మంది పంచాయతీ కార్యదర్శులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నియామకాలను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నియామకాలను ఏ పద్ధతిలో చేపట్టాలనే అంశంపై అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా 9200మంది పంచాయతీ కార్యదర్శులను నియమించేందుకు తీసుకోవల్సిన జాగ్రతలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వారం రోజుల్లోగా జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 31లోగా నోటిఫికేషన్‌ను జారీ చేసి, సెప్టెంబర్ నెల రెండో వారంలో రాత పరీక్షను నిర్వహించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. రాత పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? లేదా మ్యాన్వల్‌గా నిర్వహించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎట్టకేలకు రాత పరీక్షను నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెరిట్ పద్దతి వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 9200 పోస్టులకు సూమారు 5లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ పోస్టులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉండాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో డిగ్రీలో ఇంజనీరింగు, అగ్రికల్చర్, తదితర కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయా కోర్సుల్లో మార్కుల జాబితాలు వేర్వేరుగా ఉన్నాయి. పైగా కొన్ని యూనివర్శిటీలు గ్రేడులను ఇస్తుంది. దీంతో వీటిని మెరిట్ ప్రాతిపదికనా తీయడం కష్టమేనని అధికారులు నిర్ధారించారు. ఈ సమస్యలను పూర్తిగా అధిగమించాలంటే రాతపరీక్షయే ఉత్తమమని తేల్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయానికి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనున్నది. రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, జేఎన్‌టీయూలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

ప్రభుత్వ సంస్థలకే రాత పరీక్షను అప్పగించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కానీ పోస్టుల భర్తీ ప్రక్రియను అయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించనున్నారు. దీంతో ప్రక్రియను సజావుగా చేపట్టాలని పంచాయతీరాజ్‌శాఖ యోచిస్తున్నది. ఇదిలా ఉండగా పంచాయతీ కార్యదర్శుల విధి, విధానాలను కూడా నిబంధనల్లో రూపొందించారు. ప్రధానంగా అయా గ్రామాల్లోనే కార్యదర్శులు తప్పకుండా బస చేసే విధంగా నిబంధనల్లో పేర్కొన్నారు. గ్రామాల్లోని ఇంటి పన్ను వసూలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధీ ద్వీపాలు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు, ఆసరా పింఛన్ల పంపిణీ, రైతు బంధు పథకం, వైద్య ఆరోగ్యం, పశు సంవర్ధకశాఖ, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు తదితర అంశాలను పంచాయతీ కార్యదర్శి చూసుకునే విధంగా నిబంధనల్లో పొందుపర్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 8695 గ్రామ పంచాయతీలతో పాటు, నూతనంగా ఏర్పాటైన 4056 గ్రామ పంచాయతీల్లోనూ కార్యదర్శులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పైగా ప్రస్తుతం 3551 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరికి 4 గ్రామ పంచాయతీలను అప్పగించింది. దీంతో గ్రామాభివృద్ధికి కొంత ఆటంకం కూడా కల్గుతున్నదని ప్రభుత్వం భావించి భారీస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని తెలిసింది. దీంతో ఈ భర్తీ ప్రక్రియను కూడా పకడ్భందిగా నిర్వహించాలని నిరుద్యోగులు కూడా అభిప్రాయపడుతున్నారు

Tags :

Releted News

Vizag Steel Plant Jobs Recruitment for Multiple Vacancies

09:05:00 | 11-Apr-2018
1555    0

Vizag Steel Plant Jobs Recruitment Notification 2018.Vizag Steel Plant inviting applications for the positions of Specialist/ Junior Specialist/ Probationary, Deputy Chief Specialist/ Junior Specialist/ Specialist, General Manager.Interested and Eligible candidates can apply for the positions.   Last Date for Submission of Application is on April 25th, 2018..   Post and Vacancies : 1.Specialist/ Junior Specialist/ Probationary - 03 2.Deputy Chief Specialist/ Junior Specialist/ Specialist - 01 3.General Manager - 01   Job Location : Visakhapatnam   Specialist/ Junior Specialist/ Probationary:   Salary: Rs. 20,600 - Rs. 58,000/- Per Month   Qualification Details:  i. Qualification:  1. Specialist (E-3) / Jr.Specialist (E-2) / Probationary Spl. (E1) * (Radiology): Post Graduate Degree (MD/DNB) in Radio diagnosis from any recognized University/ State or Central Government Institution/Medical College recognized by Medical Council of India (MCI).   2. Specialist (E-3) / Jr.Specialist...

IIM Visakhapatnam Recruitment 2018...Last date April 16th, 2018..

09:55:00 | 11-Apr-2018
1555    0

IIM Visakhapatnam Recruitment 2018.Indian Institute of Management Visakhapatnam has released a notification for the recruitment of Junior Engineer and Project Engineer vacancies.Check the eligiblity and notification prior to apply for the positions.   Last date for Submission of Application is on April 16th, 2018..   Total No.of Posts:02   Name of the Post: 1. Junior Engineer – Civil: 01 Post   2. Project Engineer – Civil: 01 Post   Qualification: Bachelor’s degree in Civil Engineering with post-qualification experience.   Apply mode: Online.   Last date for applying online: 16.04.2018.

Indian Bank Jobs Recruitment Notification 2018.

10:41:00 | 11-Apr-2018
1555    0

Indian Bank Jobs Recruitment Notification 2018.Indian Bank inviting applications for the positions of Specialist Officers.Interested and Eligible candidates can apply for the positions.   Last Date for Submission of Application is on May 02nd, 2018..   Post and Vacancies : 1.Specialist Officers - 145   Job Location : Across India   Salary: Rs. 23,700 - Rs. 66,070/- Per Month   Qualification Details:  Post Name & Pay:  Specialist Officers - Scale I (Minimum)- Scale V (Maximum) -  23700 - 66070   1 .Information Technology Department / Digital Banking Department:   a. No of Vacancy - Assistant General Manager - 01, Chief Manager - 09, Manager -13, Senior Manager -08   b. Qualification: Electronics/ Electronics & Telecommunications/ Electronics & Communication/ Electronics & Instrumentation OR b) Post Graduate Degree in Electronics/ Electronics & Tele Communication/ Electronics & Communication/ Electronics & Instrumentation/ Computer Science/...

ఉద్యోగ అవకాశాలు... ఇండియన్ ఎయిర్ ఫోర్స్

16:50:00 | 05-Apr-2018
1555    0

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.... ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ పోస్ట్ లు.... యువతి/యువకులకు IAF లో ఆఫీసుర్లు గా చేరుటకు సువర్ణ అవకాశం  Posts:- Officers-Flying అర్హత:-Any Degree/BTech Posts:- Ground Duty-Ad అర్హత:-Any DEGREE Posts:- Ground Duty-Log అర్హత:-Any DEGREE Posts:- Ground Duty-Acc అర్హత:-B-Com  Posts:- Ground Duty-Ed అర్హత:- Any PG/ M.A, MSc, MBA, MCA డిగ్రీ /పిజి విద్యార్థులు. / ఫైనల్ ఇయర్ విద్యార్థులు 01-07-2018 లోపు విద్యాఅర్హతలు పూర్తి చేయువారు కూడా అప్లై చేయవచ్చు.. జీత భత్యాలు;- - Flying...

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఎడ్‌సెట్‌ రాయవచ్చు

09:51:00 | 30-Mar-2018
1555    0

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఎడ్‌సెట్‌ రాయవచ్చని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ టి.కుమారస్వామి తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఏప్రిల్‌ 19న ఎడ్‌సెట్‌ నిర్వహిస్తామన్నారు. బీఈడీ చేయదలచుకున్న విద్యార్థులు ఏప్రిల్‌ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.650, ఎస్సీ, ఎస్టీలు రూ.450 ఫీజు చెల్లించాలని సూచించారు.

ఎంసెట్‌లో కొత్త విధానం:ఇక సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండదు

16:05:00 | 22-Mar-2018
1555    0

కాకినాడ:ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే...ఎంసెట్‌లో క్వాలిఫై అయ్యాక హెల్ప్ సెంటర్ల పేరిట సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థులకు నెలల తరబడి చుక్కలు చూపించే పాత విధానంకు ఫుల్ స్టాప్ పడనుంది. చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన ఎంసెట్ విద్యార్థుల కోసం నూతనంగా అందుబాటులోకి తెస్తున్న ఓ సరి కొత్త విధానం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది....

తెలంగాణా పోస్టల్లో.. 1,058 ఉద్యోగాలు

12:00:00 | 15-Mar-2018
1555    0

తెలంగాణ పోస్టల్ సర్కిల్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (జీపీవో)తోపాటు వివిధ హెడ్ పోస్టాఫీస్ (హెచ్వో), సబ్ పోస్టాఫీస్ (ఎస్వో), బ్రాంచ్ ఆఫీస్ (బీవో)ల్లోని 1,058 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది. పోస్టు: గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్). ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), మెయిల్ డెలివరర్ (ఎండీ), మెయిల్ క్యారియర్ (ఎంసీ), మెయిల్ ప్యాకర్ (ఎంపీ), మెయిల్ మ్యాన్ కేటగిరీ పోస్టులున్నాయి. మొత్తం...

ఉద్యోగ అవకాశాలు...నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో ఉద్యోగాలు

11:00:00 | 14-Mar-2018
1555    0

నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సిఎల్) - పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 664 పోస్టుల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ లోడింగ్ క్లర్క్ 26, క్లర్క్ 51, ట్రిప్మాన్ 16, క్లర్క్ (ఔల్) 7, అకౌంట్స్ క్లర్క్ 19, అసిస్టెంట్ క్యాషియర్ 5, స్టోర్ ఇష్యూ క్లర్క్ 7, ఫార్మాసిస్ట్ 3, డ్రెస్సర్ 8, సెక్యూరిటీ గార్డ్ 393, మైనింగ్ సిర్దార్ 36, జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ 21, జూనియర్ కెమిస్ట్ 9, ఆపరేటర్ 54, టెలీకాం / రేడియో...

ఉద్యోగ అవకాశాలు...పోలీస్ ,సాయుధ దళాల్లో ఎస్ఐ పోస్టులు

17:30:00 | 12-Mar-2018
1555    0

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)... సాయుధ దళాలు (సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్), ఢిల్లీ పోలీస్ విభాగంలోని 1,223 ఎస్ఐ పోస్టులకు, సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లోని ఏఎస్ఐ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ). విభాగాల వారీ ఖాళీలు: ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ-150 (పురుషులు-97 మహిళలు-53), సాయుధ...

వ్యాపారం పెట్టాలనుకునే వారికీ మోడీ ప్రభుత్వం చేయూత

15:08:00 | 12-Mar-2018
1555    0

మీరు చిన్న వ్యాపారంలో మీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఇది సరైన సమయం. నరేంద్రమోడీ ప్రభుత్వం ఇందుకు గాను రూ. 4 లక్షలు అందజేయనుంది. ఈ వ్యాపారం ఏమిటి మరియు మీరు ఈ ప్రయోజనం ఎలా పొందవచ్చు. ఈ వ్యాపారం కోయిర్ ఉద్యమి యోజన క్రింద వస్తుంది. కోయిర్ ఉద్యమి యోజన అంటే ఏమిటి? I.ఇది కోయిర్ యూనిట్లు ఏర్పాటు కోసం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ప్రాజెక్ట్ వ్యయం రూ .10 లక్షలు ప్రాజెక్ట్ వ్యయంలో 25% ను మించకూడదు. సబ్సిడీ కోసం...

ఉద్యోగ అవకాశాలు...పోస్టల్ సర్కిల్లో కొలువులు..

13:45:00 | 12-Mar-2018
1555    0

పోస్టల్ డిపార్ట్మెంట్ తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1058 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) లకు గాను ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు కావాల్సిన అర్హత..పదోతరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటె సరిపోద్ది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోస్టు: గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) * ఖాళీలు: 1058 * అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్...

ఉద్యోగ అవకాశాలు...బీహెచ్‌ఈఎల్‌లో 918 అప్రెంటిస్‌లు

08:06:00 | 10-Mar-2018
1555    0

పదోతరగతి + ఐటీఐ ఉత్తీర్ణత -ఇంటర్వూ ద్వారా ఎంపిక -శిక్షణ కాలంలో స్టయిఫండ్ తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ (ఐటీఐ హోల్డర్స్) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివరాలు: దేశంలో అతిపెద్ద విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ను 1964లో ఏర్పాటు చేశారు.ఈ సంస్థ మహారత్న హోదా కలిగి...

< 1 2 3 4 5 >