ఫస్ట్ అమెరికన్ కంపెనీ త్వరలోనే బెజవాడలో తన కార్యకలాపాలు

08:16:00 | 25-Jul-2018
1555    0

త్వరలో బెజవాడకి మరో ప్రతిష్టాత్మక సంస్థ…! 

టైటిల్ మరియు ఇన్సూరెన్స్ సర్వీసెస్, మోర్ట్గేజ్ హోమ్ వారంటీ సర్వీసెస్ లో ఉన్న ఫస్ట్ అమెరికన్ కంపెనీ త్వరలోనే బెజవాడలో తన కార్యకలాపాలను మొదలు పెట్టనుంది.
అయితే ఆ క్రమంలోనే ఈరోజు, రెవెన్యూ శాఖ అధికారులు, ఫస్ట్ అమెరికా (ఇండియా) వైస్ ప్రెసిడెంట్ రఘు, సీనియర్ మ్యానేజర్ శ్రీనివాస్ రావులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇక ఈ భేటీ గురించి వినిపిస్తున్న వివరాల ప్రకారం, టైటిల్ మరియు ఇన్సూరెన్స్ సర్వీసెస్, మోర్ట్గేజ్ హోమ్ వారంటీ సర్వీసెస్ ను అందిస్తుంది ఫస్ట్ అమెరికన్ కంపెనీ, అదే క్రమంలో లోకేష్ మాట్లాడుతూ ల్యాండ్ రికార్డ్స్ అన్ని డిజిటైజ్ చేస్తున్నాం. ఇక టాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ల్యాండ్ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజి వేదిక పైకి తీసుకొస్తున్నాం అని. దీని వలన రైతులు తక్కువ సమయంలో టైటిల్ ఇన్సూరెన్స్, రుణాలు పొందే అవకాశం వచ్చింది అని ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం ప్రాథమిక హక్కుగా మారబోతుంది. ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసాం.149 రూపాయిలకే వైఫై,ఇంటర్నెట్,టెలివిజన్ అందిస్తున్నాం. సర్టిఫికెట్ లెస్ గవర్నమెంట్ తీసుకురావలి అన్న సంకల్పంతో పని చేస్తున్నాం. ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ చెయ్యడం ద్వారా 20 శాతం వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది. 3,47,862 రికార్డులు డిజిటైజ్ చేసాము, దేశంలోనే మొదటి డిజిటైజ్ డాక్యుమెంట్స్ కలిగిన మొదటి సబ్ రిజిస్టర్ కార్యాలయం గా గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం రికార్డ్ గా నిలిచింది అని. ఆ క్రమంలోనే మొదటి దశగా 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్న ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ చెయ్యాలి అని తరువాత దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 290 పైన సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్న ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ చెయ్యాలి అని. ఫైబర్ గ్రిడ్ ని వినియోగించుకొని గ్రామాల్లో యువతి,యువకులు వారి ఇంటి నుండే పని చేసుకునేలా ఒక మోడల్ అభివృద్ధి చెయ్యండి.

దీని వలన మీకు ఆపరేషన్ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అని, ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇచ్చి,డ్వాక్రా గ్రూప్ మహిళలు,గృహిణులు, యువత ఇంటి నుండే పనిచేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించండి అని లోకేష్ తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలని ఆహ్వానం ఆహ్వానించగా, ఫైబర్ గ్రిడ్ ని ఉపయోగించుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ పైలెట్ ప్రొజెక్ట్ కొన్ని గ్రామాల్లో నిర్వహిస్తాం, దీని వలన గ్రామాల్లో మహిళలు,యువత ఇంటి నుండే పనిచేసుకొని ఆదాయం పొందవచ్చు, ఎపిటిఎస్ తో భాగస్వామ్యం అయ్యి గన్నవరం లో చేపట్టిన ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది.

త్వరలోనే విజయవాడలో కంపెనీ ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరిస్తాం, ఇంటి నుండి పనిచేస్తూ ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చేసే కార్యక్రమం విజయవంతం అయితే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల ల్యాండ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ నుండి చేసే అవకాశం వస్తుంది. దీని వలన ఎంతో మందికి ఇంటి నుండే పనిచేసుకునే విధంగా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి అని ఫర్స్ట్ అమెరికా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

 

Tags :

Releted News

ఫార్మా, ఎనర్జీ, బ్యాంకింగ్ అండ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

19:28:00 | 17-Jul-2018
1555    0

  196 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరోసారి 11వేల మైలురాయిని అధిగమించిన నిఫ్టీ 19 శాతం పైగా పెరిగిన ఫెడరల్ బ్యాంక్ ఫార్మా, ఎనర్జీ, బ్యాంకింగ్ స్టాకుల అండతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మరోసారి 11 వేల మార్కును అధిగమించింది.  ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 196 పాయింట్లు పెరిగి 36,520కి ఎగబాకింది. నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 11,008 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్...

నష్టాలలో ముగిసిన నేటి స్టాక్ మార్కెట్లు!

20:10:00 | 16-Jul-2018
1555    0

  218 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 10,937 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ 25శాతం పైగా నష్టపోయిన పీసీ జువెలర్స్ ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, రెండో త్రైమాసికంలో చైనా ఎకానమీ కొంతమేర తగ్గిన నేపథ్యంలో  ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 218 పాయింట్లు కోల్పోయి 36,324కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 10,937కు...

ఇండియా ట్రేడ్‌ కనెక్ట్‌ నెట్‌వర్క్‌ను అమర్చుతున్నట్టు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తెలిపింది

11:22:00 | 17-May-2018
1555    0

భారత్‌లో యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ ఇండ్‌, ఆర్‌బీఎల్‌, కొటక్‌ మహింద్రా, సౌత్‌ ఇండియా, యస్‌ బ్యాంకుల భాగస్వామ్యంతో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఇండియా ట్రేడ్‌ కనెక్ట్‌ నెట్‌వర్క్‌ను అమర్చుతున్నట్టు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తెలిపింది. ‘ఈ పినాకిల్‌ ట్రేడ్‌ కనెక్ట్‌ను బ్యాంకులు పైలెట్‌ ప్రాజెక్టుగా ఉపయోగిస్తాయి. బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను విజయవంతంగా...

At present, the TCS share price is Rs 3354.75.

16:53:00 | 20-Apr-2018
1555    0

Tata Consultancy Services Ltd (TCS), one of the largest IT firms in the country, grew by more than five per cent.   In the quarter ending March, TCS gained the market expectations and increased its demand for shares.   At present, the TCS share price is Rs 3354.75.   The market value of the company rose by Rs 30,000 crore after the share price rose 5 per cent.   TCS had a net profit of Rs 6904 crore in the quarter ending March.   The company said it has earned revenue of Rs 32075 crore from Operations. It was 8.2 percent more than last year.   దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) షేర్లు ఏకంగా ఐదు శాతం మేర పెరిగాయి. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను టీసీఎస్ లాభాలు...

విజయవాడ కేంద్రంగా సెలబ్రిటీ హబ్‌ను ప్రారంభించాం

15:16:00 | 07-Apr-2018
1555    0

ఈ రోజుల్లో బ్రాండింగ్, ప్రచారం లేకపోతే వస్తువులు, ఉత్పత్తులను ప్రజలు ఆదరించట్లేదు. మరి, సెలబ్రిటీలు, ప్రముఖులతో ప్రచారం చేయించాలంటే వాళ్లు ఎక్కడుంటారో తెలియదు? ఎలా కలవాలో తెలియదు? ఒకవేళ కలిసినా మనకు టైమిస్తారో లేదో తెలియదు? ఇలా రకరకాల సమస్యలుంటాయి. వీటన్నింటికీ పరిష్కరించడమే సెలబ్రిటీ హబ్‌ ప్రత్యేకత. ప్రారంభోత్సవాలకు, బ్రాండింగ్‌ ప్రమోషన్‌ చేయించడం మా పని. సెలబ్రిటీలతో ప్రచారం అంటే కార్పొరేట్‌...

< 1 >