సెప్టెంబర్15న ప్రారంభమవుతున్న ఆసియా కప్... ఇండియా,పాకిస్తాన్ మధ్య పోటీ

10:10:00 | 25-Jul-2018
1555    0

భారత్-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ తేదీ ఖరారు..

చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్తాన్‌ జట్లు ఆసియా కప్‌ వేదికగా మరోసారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 15న ప్రారంభమయ్యే టోర్నీ షెడ్యూల్‌ విడుదలైంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌పాటు ఓ క్వాలిఫయర్‌ జట్టు.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో 18న క్వాలిఫయర్‌తో ఆడుతుంది. ఆ మరుసటి రోజు జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను టీమిండియా ఢీకొంటుంది. గ్రూప్‌ దశ లో రెండు జట్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్‌ 28న ఫైనల్‌ జరుగుతుంది. టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగే ఏకైక జట్టు చోటు కోసం యూఏఈ, సింగపూర్‌, ఒమన్‌, నేపాల్‌, మలేసియా, హాంకాంగ్‌ పోటీపడుతున్నాయి.

Tags :

Releted News

< 1 2 3 >