కాన్సర్ రోగులను ఆప్యాయంగా పలకరించిన నటుడు జగపతిబాబు

17:00:00 | 15-Jul-2018
1555    0

క్యాన్సర్‌ రోగులను పరామర్శించిన-జగపతిబాబు

విజయవాడ: విలక్షణ నటుడు జగపతిబాబు ఆదివారం విజయవాడ నగరంలో పర్యటించారు. 

అశోక్‌నగర్‌లోని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సంస్థను సందర్శించారు. 

చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులను ఆప్యాయంగా పలకరించిన జగపతిబాబు... రూట్స్ ఫౌండేషన్ వారు క్యాన్సర్ రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు చూసి హర్షం వ్యక్తం చేసారు. 

ఎవరికీ వారే స్వార్థంతో బతుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా స్వచ్చందంగా సేవ చేయడం అభినందనీయమని ప్రశంసించారు. 

చివరి రోజులు గడుపుతున్న క్యాన్సర్ రోగుల బాధను పంచుకుని అండగా ఉంటున్న ఈ స్వచ్చంద సంస్థ సభ్యులు అభినందనీయులని కొనియాడారు. 

రోజులు లెక్కపెట్టుకుంటూ బతకడం ఎంత కష్టమో అందరికీ తెలుసని.. ఇలాంటి స్వచ్చంద సంస్థలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

‘సైరా’ చిత్రంలో నటిస్తున్న జగపతి ఈరోజు షూటింగ్ సర్దుబాటు చేసుకుని వచ్చినట్లు తెలిపారు. 

చివరి రోజులు గడుపుతున్న ఈ అభాగ్యులకు అండగా నిలబడి వారికి సేవ చేస్తున్న రూట్స్ ఫౌండేషన్ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.

Tags :

Releted News

సినీనటి నమిత వివాహం తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో జరిగింది.

09:30:00 | 24-Nov-2017
1555    0

తమిళ దర్శక, నిర్మాత వీరేంద్రచౌదరిని నమిత పెళ్లాడారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక వైభవంగా జరిగింది. నటి రాధిక దంపతులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారి వివాహ రిసెప్షన్ చెన్నైలో జరగనుంది.

< 1 2 3 4 5 6 >