ప్రియాంక చోప్రా, అమెరికన్‌ స్టార్‌ నిక్‌ జోనాస్‌తో ప్రేమ...నిజమా

15:52:00 | 15-Jul-2018
1555    0

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ స్టార్‌ నిక్‌ జోనాస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం తెలిసిందే. 

దీనిపై ప్రియాంక, నిక్‌లు నోరు మెదపకపోయినా వరుస టూర్లు, పార్టీలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. 

ప్రియాంక పుట్టిన రోజు కోసం నిక్‌ భారీగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

ఈ నెల 18న ప్రియాంక తన 36వ ఏట అడుగుపెట్టబోతున్నారు. 

ఈ సందర్భంగా ప్రియాంకకు ఇష్టమైన ఓ బీచ్‌లో సెలబ్రేషన్స్‌ చేయాలని నిక్‌ ప్లాన్‌ చేశారట. 

నిక్‌కు ముందుగా అనుకున్న కమిట్‌మెంట్స్‌ ఉండటం వల్ల అమెరికాను దాటి వెళ్లడానికి కుదరడం లేదని తెలిసింది. 

దాంతో వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో పుట్టిన రోజు వేడుక జరిపి ప్రియాంకపై తనకు ఉన్న ప్రేమను తెలిపేందుకు నిక్‌ సిద్ధమవుతున్నారట.

Tags :

Releted News

సినీనటి నమిత వివాహం తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో జరిగింది.

09:30:00 | 24-Nov-2017
1555    0

తమిళ దర్శక, నిర్మాత వీరేంద్రచౌదరిని నమిత పెళ్లాడారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక వైభవంగా జరిగింది. నటి రాధిక దంపతులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారి వివాహ రిసెప్షన్ చెన్నైలో జరగనుంది.

< 1 2 3 4 5 6 >