గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు

06:12:00 | 02-May-2018
1555    0

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు.

గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగాబయటపడుతుంటాయి.

గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. ఈస్ట్రోజెన్‌ హార్మోను వీటిని ప్రభావితం చేస్తుందన్నది.

అధిక రుతుస్రావం.. నొప్పి..
సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి?

అల్లోపతి అను మొరటు వైద్య విధానం:
ఫైబ్రాయిడ్లు ఉన్నా బాధలేవీ లేకపోతే ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.

సైడెఫెకక్ట్స్:
అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి. అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల వీటిని 3-6 నెలల కన్నా ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి ప్రొజెస్టిరాన్‌ను విడుదల చేసే ఐయూడీని లోపల అమరుస్తారు. ఇది రుతుస్రావం అధికంగా కావటాన్ని తగ్గిస్తుంది. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు. ప్రస్తుతం అబ్లేషన్‌ ప్రక్రియతో కణితికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని మూసేసే పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దీంతో గడ్డ క్రమేపీ చిన్నదై, మాయమవుతుంది.

ఆయుర్వేదం చెప్పే కారణాలు:

ఇవిరావడానికి ప్రధాన కారణం చిత్తచాంచల్యము... ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది... అశోక, నాగకేసరాలు , భూమ్యామలక, దూసరాకు (పైనపట్టుగావేయుట) కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా మొరటువైద్యంవలన ఫలితం శూన్యం... సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం.
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా అత్యుత్తమ చికిత్స కలదు.

Tags :

Releted News

గుంటూరు నగరంలోని ఆసుపత్రులు, :ఫోన్‌ నంబర్లు

07:00:00 | 10-Mar-2018
1555    0

జీజీహెచ్‌ (ప్రభుత్వ సమగ్ర వైద్యశాల), రైల్వేస్టేషన్‌ ఎదురుగా, గుంటూరు. 0863 - 2220161 * ఎన్నారై జనరల్‌ ఆసుపత్రి, చినకాకాని, మంగళగిరి. ఫోన్‌ : 08645 - 236777 * గుంటూరు ఇ.ఎన్‌.టి. క్లినిక్‌ - (0863) 2324444, 98481 48082 * కీర్తి హాస్పటల్‌ - (0863) 3191555 * అమరావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌) - (0863)2256699, 2256688 * తులసీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ - (0863) 2323235, 2355559 * క్వాలిటీ హాస్పటల్‌ - (0863) 2264889 * వీణ హాస్పటల్స్‌ - (0863) 2220739 * హరికృష్ణ డయాబెటిక్‌ కేర్‌...

ఆరోగ్యమే మహాబాగ్యం...స్థూలకాయత్వానికి గురయ్యే ముందు బహిర్గతమయ్యే సంకేతాలు

10:56:00 | 06-Mar-2018
1555    0

స్థూలకాయత్వం అనేక వ్యాధులను కలిగించే మార్గంగా చెప్పవచ్చు. దీని వలన మధుమేహం, గుండె వ్యాధులు మరియు ఇతరేతర సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కానీ, :zzz: స్థూలకాయత్వానికి గురయ్యే ముందు కొన్ని లక్షణాలు సంకేతాలుగా బహిర్గతం అవుతాయి. వీటి గురించి తెలుసుకోవటం వలన తగిన జాగ్రత్తలను ముందు నుండే పాటించవచ్చు. :zzz: *నేను లావుగా ఉన్నానా?* :zzz: స్థూలకాయత్వం పరంగా,  ప్రపంచంలో రెండు రకాల మనస్తత్వాలు గల వ్యక్తులు ఉన్నారు, వారిలో-...

సుఖవ్యాధులు తో జాగ్రత్త...

06:39:00 | 11-Jan-2018
1555    0

హెచ్చరిక ..!ఎయిడ్స్‌ను‌ మించి‌ ప్రమాదకరంగా మారిన ఓ ‘సుఖవ్యాధి’..!ఆందోళనలో ప్రజలు …!   సెగవ్యాధి లేదా గనేరియా ఒక విధమైన అంటు వ్యాధి. ఇది నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక సామాన్యమైన సుఖ వ్యాధి అమెరికాలో దీనిది క్లమీడియా తర్వాత రెండవ స్థానం. సంభోగం లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో...

ఐఎంఏ ప్రొఫెసర్గా ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం

18:30:00 | 25-Nov-2017
1555    0

విజయవాడ: ప్రముఖ సెక్సాలజిస్ట్ గా తెలుగునాట ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సమరంకు ఇప్పుడు మరో మైలురాయి అధిగమించారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రొఫెసర్ గా ఆయన ఎంపికయ్యారు. కన్యాకుమారిలో జరిగిన ఐఎంఎ జాతీయ స్థాయి సమావేశం లో డాక్టర్ సమరం ను ఐఎంఏ ప్రొఫెసర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యరంగంలో డాక్టర్ సమరం అసాధారణ సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. వైద్యరంగంలో ఎన్నో అసాధారణ విజయాలు...

< 1 >