అర్జున్ అవార్డ్‌ గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఆరోపణలు

17:03:00 | 06-May-2018
1555    0

ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నా... స్పోర్ట్స్ అథారిటీ, కోచ్‌లు బహుమానాలను అడ్డుకుంటున్నారని అర్జున్ అవార్డ్‌ గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఆరోపించారు.

ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించినా ఇప్పటివరకు అందలేదని అన్నారు.

చెరుకూరి సత్యనారాయణ తనకు కోచ్ కాదని జ్యోతి సురేఖ అన్నారు.

ప్రభుత్వం అందించనున్న నజారానాలో చెరుకూరి వాటాలు తీసుకోబోతున్నారని, రాష్ట్రం నుంచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

సత్యనారాయణ హాస్టల్ వార్డన్ మాత్రమే.. కోచ్ కాదని జ్యోతి సురేఖ మరోసారి స్పష్టం చేశారు.

ప్రోత్సాహకం విషయంలో జ్యోతి సురేఖకు అన్యాయం జరుగుతోందని జ్యోతి సురేఖ తండ్రి సురేంద్ర కుమార్‌ అన్నారు.

15 అంతర్జాతీయస్థాయి పతకాలు తెస్తే ...11 పతకాలకు శాప్ అధికారులు ప్రోత్సాహకం తిరస్కరించారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం అర్జున అవార్డు ఇస్తే నగదు ప్రోత్సహకంలోనూ కోత విధిస్తున్నారని, శాప్ ప్రభుత్వ ఆధీనంలో లేదని... కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తోందని ఆయన విమర్శించారు.

తమకు జరుగుతోన్న అన్యాయంపై సీఎం దృష్టి సారించి విచారణ జరపాలని కోరారు.

తమకు న్యాయం జరగకపోతే రేపు నిరాహార దీక్షకు దిగుతామని సురేంద్ర కుమార్‌ అన్నారు.

Tags :

Releted News

< 1 2 3 >