సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్‌ గర్ల్స్‌ ఆఫ్‌ బాడ్మింటన్‌ పేరుతో ఘనంగా సన్మానం

18:47:00 | 05-May-2018
1555    0

బ్యాడ్మింటన్‌లో భారత సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్‌ గర్ల్స్‌ ఆఫ్‌ బాడ్మింటన్‌ పేరుతో ఘనంగా సన్మానించింది.

వారిని ఉన్నత స్థానానికి తీసుకురావడానికి కారణమైన పుల్లెల గోపీచంద్‌ను సైతం నిర్వాహకులు సన్మానించారు. ఈసందర్భంగా పుల్లెల మాట్లాడుతూ సైనా, సింధూ ఇద్దరూ వజ్రాల్లాంటి వారని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని పేర్కొన్నారు.

భవిష్యత్తులో భారత్‌కు బాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు వస్తాయని అన్నారు. సింధూ హార్డ్‌ వర్కర్‌ అని, సైనా ఎనర్జీ అమోఘమని గోపీచంద్‌ కితాబిచ్చారు.

జీవితంలో విజయం సాధించిన మహిళలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముందని అందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పింకీరెడ్డి తెలిపారు.

అనంతరం బాడ్మింటన్‌లో తమ అనుభవాలను సైనా, సింధూ వారితో పంచుకున్నారు. రియో ఒలంపిక్స్‌లో బాడ్మింటన్‌ పతకం వచ్చిందని, రానున్న ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు వస్తాయని వారు మీడియాకు చెప్పారు.

ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపటంతో పాటు సినిమాలు చూస్తానని సింధూ తెలిపారు. సైనా మాట్లాడుతూ తనకు బాలీవుడ్‌ చిత్రాలంటే పిచ్చంటూ ముచ్చటించారు.

Tags :

Releted News

< 1 2 3 >