సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్‌ గర్ల్స్‌ ఆఫ్‌ బాడ్మింటన్‌ పేరుతో ఘనంగా సన్మానం

18:47:00 | 05-May-2018
1555    0

బ్యాడ్మింటన్‌లో భారత సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్‌ గర్ల్స్‌ ఆఫ్‌ బాడ్మింటన్‌ పేరుతో ఘనంగా సన్మానించింది.

వారిని ఉన్నత స్థానానికి తీసుకురావడానికి కారణమైన పుల్లెల గోపీచంద్‌ను సైతం నిర్వాహకులు సన్మానించారు. ఈసందర్భంగా పుల్లెల మాట్లాడుతూ సైనా, సింధూ ఇద్దరూ వజ్రాల్లాంటి వారని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని పేర్కొన్నారు.

భవిష్యత్తులో భారత్‌కు బాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు వస్తాయని అన్నారు. సింధూ హార్డ్‌ వర్కర్‌ అని, సైనా ఎనర్జీ అమోఘమని గోపీచంద్‌ కితాబిచ్చారు.

జీవితంలో విజయం సాధించిన మహిళలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముందని అందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పింకీరెడ్డి తెలిపారు.

అనంతరం బాడ్మింటన్‌లో తమ అనుభవాలను సైనా, సింధూ వారితో పంచుకున్నారు. రియో ఒలంపిక్స్‌లో బాడ్మింటన్‌ పతకం వచ్చిందని, రానున్న ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు వస్తాయని వారు మీడియాకు చెప్పారు.

ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపటంతో పాటు సినిమాలు చూస్తానని సింధూ తెలిపారు. సైనా మాట్లాడుతూ తనకు బాలీవుడ్‌ చిత్రాలంటే పిచ్చంటూ ముచ్చటించారు.

Tags :

Releted News

భారత గ్రేట్ ఆల్రౌండర్... 300 వికెట్ల క్లబ్లో అశ్విన్

17:30:00 | 27-Nov-2017
1555    0

భారత క్రికెట్ జట్టుకు దొరికిన గ్రేట్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఇతగాడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు తీసిన భారత బౌలర్గా తన పేరును లిఖించుకున్నాడు. అదీకూడా అత్యంతవేగంగా ఈ వికెట్లను తీశాడు. ఫలితంగా అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నాగ్పూర్ వేదికగా ప్రత్యర్థి శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. పనిలోపనిగా స్పిన్నర్...

శ్రీలంకతో వన్డే సీరిస్కు భారత జట్టు

19:30:00 | 27-Nov-2017
1555    0

ముంబై : బీసీసీఐ సెలక్టర్లు శ్రీలంకతో వన్డే సీరిస్ భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే సీరిస్ నుంచి కోహ్లికి విశ్రాంతినిచ్చారు. ఈ వన్డే సీరిస్ లో రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగించారు. 15 మందితో వన్డే జట్టు ప్రకటించారు. జట్టు సభ్యుల్లో రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, దోనీ, పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్, చాహల్, బుమ్రా, భువీ, సిద్దార్థ కౌల్...

డిసెంబరు నెల 17న భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న డే అండ్‌ నైట్‌ వన్డే మ్యాచ్‌....టిక్కెట్‌ ధరలను రూ.500, 1200, 1800, 2500, 6000

10:30:00 | 26-Nov-2017
1555    0

పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో వచ్చే నెల 17న భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న డే అండ్‌ నైట్‌ వన్డే మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం కార్యనిర్వహణ కమిటీ సమావేశమైంది. నగరంలో ఒక హోటల్లో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అధ్యక్షుడు జీవీకే రంగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మ్యాచ్‌ భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్‌, టికెట్ల అమ్మకంపై చర్చించారు. అనంతరం ఏసీఏ ప్రధాన కార్యదర్శి...

205 పరుగులకే అల్ ఔట్ అయిన శ్రీలంక

17:30:00 | 24-Nov-2017
1555    0

తొలి రోజు టీమిండియాదే.. నాగ్పూర్: రెండో టెస్ట్ తొలి రోజు టీమిండియా హవా నడిచింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చినా.. మ్యాచ్ను ఘనంగానే ప్రారంభించింది. శ్రీలంకను 205 పరుగులకే ఆలౌట్ చేసిన కోహ్లి సేన.. తర్వాత తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. 7 పరుగులు చేసిన రాహుల్ ఔటయ్యాడు. పుజారా (2), విజయ్ (2) క్రీజులో ఉన్నారు. శ్రీలంక కంటే ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది టీమిండియా....

భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది.

10:00:00 | 24-Nov-2017
1555    0

భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది. పర్యాటక జట్టు ఎలాంటి మార్పులు లేకుండా తొలి టెస్టు ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. మరోపక్క భారత్ మూడు మార్పులు చేసింది. ధావన్ స్థానంలో మురళీ విజయ్, భువనేశ్వర్ కుమార్ స్థానంలో రోహిత్ శర్మ, మహమ్మద్ షమి స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈడెన్లో...

క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ దుస్తుల్లో దర్శనమిచ్చాడు.

09:30:00 | 23-Nov-2017
1555    0

లెఫ్టినెంట్ కల్నల్ ధోనీ శ్రీనగర్‌లో విద్యార్థులను కలిశాడు. చదువులు, క్రీడల పట్ల శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు ధోనీ సూచించాడు. విద్యార్థులను ధోనీ కలిసిన ఫోటోలను దుగారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ పిల్లలను ధోనీ కలిశాడు. 2014 డిసెంబర్‌లో ధోనీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు మళ్లీ ధోనీ జట్టులో...

'యువీపై ఎటువంటి కేసు నమోదు కాలేదు'

14:30:00 | 19-Oct-2017
1555    0

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పై అతని మరదలు ఆకాంక్ష శర్మ గృహహింస కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలను యువీ తరపు న్యాయవాది దమన్ బిర్ సింగ్ సోబ్తి ఖండించారు.  ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. యువీపై ఆకాంక్ష ఎటువంటి కేసును పెట్టలేదని తాజాగా స్పష్టం చేశారు.  దానిలో భాగంగానే అక్టోబర్ 21వ తేదీన యువరాజ్ కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరుకావాలంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాదన్నారు. ఏ రకంగా...

'ఆనాటి సచిన్ మాటలే కారణం'

14:30:00 | 19-Oct-2017
1555    0

న్యూఢిల్లీ: ప్రస్తుతం టీమిండియా అత్యుత్తమ ఆల్ రౌండర్ గా కీర్తించబడుతున్న క్రికెటర్ హార్దిక్ పాండ్యా. భారత జాతీయ జట్టులో చోటు సంపాదించిన అనతికాలంలోనే హార్దిక్ కీలక సభ్యుడిగా మారిపోయాడు. పరిమిత ఓవర్ల సిరీస్ లో తనదైన ముద్రవేస్తూ భారత విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. అయితే తాను ఇలా సక్సెస్ కావడానికి ఒకనాటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాటలే ప్రేరణ అంటున్నాడు హార్దిక్. తాజాగా ఎన్డీటీవీకి...

బీబీఎల్ లో మరో భారత క్రీడాకారిణి

14:30:00 | 19-Oct-2017
1555    0

సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడటానికి మరో భారత క్రీడాకారిణికి అవకాశం దక్కింది. ఇప్పటికే ఈ లీగ్ లో ఇద్దరు భారత క్రీడాకారుణులు హర్మన్ ప్రీత్ కౌర్,  స్మృతి మంధన ఆడుతుండగా, తాజాగా ఇందులో ఆడేందుకు మరో భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తికి అవకాశం దక్కింది. బీబీఎల్ మహిళల మూడో ఎడిషన్ లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడేందుకు వేదా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు వేద మాట్లాడుతూ.. బీబీఎల్ ఆడే...

విరాట్ సేన సిరీస్ గెలిస్తేనే..!

14:30:00 | 19-Oct-2017
1555    0

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్న దక్షిణాఫ్రికా జట్టు తిరిగి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో విజయం సాధించిన దక్షిణాఫ్రికా వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలుపొంది టాప్ కు చేరింది. దాంతో టీమిండియా అగ్రస్థానానికి సఫారీలు ఎసరు పెట్టారు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో విజయం సాధించడం ద్వారా విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత...

అరంగేట్రంలోనే 'మేనల్లుడు 'అదుర్స్

14:30:00 | 19-Oct-2017
1555    0

అబుదాబి:ఇంజమామ్ వుల్ హక్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ల ఒకడైన ఇంజమామ్ తన టెస్టు కెరీర్ లో 25 సెంచరీలు చేయగా, 46 అర్థ శతకాలు సాధించాడు. ఇక వన్డే కెరీర్ లో 10 శతకాలు, 83 హాఫ్ సెంచరీలు అతని సొంతం. ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా సేవలందిస్తున్నాడు ఇంజమామ్. ఇదిలా ఉంచితే, ఇప్పుడు అతని మేనల్లుడిగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఇమామ్ వుల్ హక్ ఆడిన తొలి...

టాడ్ ఆస్లే స్థానంలో సోధీ

14:30:00 | 19-Oct-2017
1555    0

న్యూఢిల్లీ:టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు నుంచి గాయం కారణంగా దూరమైన టాడ్ ఆస్లే స్థానంలో ఇష్ సోధీ జట్టులోకి వచ్చాడు. వన్డే సిరీస్ కు ఆస్లే స్థానాన్ని సోధీతో భర్తీ చేసే విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. ముందుగా సోధీని టీ 20 మాత్రమే ఎంపిక చేయగా, ఆస్లే కు వన్డేల్లో చోటు కల్పించారు. అయితే బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఆస్లేకు గజ్జల్లో...

< 1 2 3 >