Receipt of applications from 28 for entries in Triple IT...ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 28నుంచి దరఖాస్తుల స్వీకరణ

08:08:00 | 28-Apr-2018
1555    0

తల్లిదండ్రులంతా తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని కలలు కంటూ ఉంటారు. విద్యార్థులలో ప్రతిభ ఉన్నా అధిక శాతం మంది ఆర్థిక ఇబ్బందులతో అనుకున్న లక్ష్యానికి చేరువైనా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి మనకు తెలియందికాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి విద్యార్హతతో త్రిపుల్‌ ఐటీలను ప్రవేశపెట్టింది. మన ప్రాంత వాసులకు బాసరలోని రాజీవ్‌గాంధీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సాంకేతిక విద్యను అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం పదో తరగతి అప్పియర్‌ అయిన విద్యార్థులంతా త్రిపుల్‌ ఐటీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ లో ట్రిపుల్‌ ఐటీలు ఉన్నప్పటికీ అవి మనకు నాన్‌లోకల్‌ అవుతాయి. సీటు సాధించిన విద్యార్థులు ఆరేళ్ల పూర్తిస్థాయి రెసిడెన్షియల్‌ విద్యతో సాంకేతిక పట్టభద్రులుగా బయటకువస్తారు.
:point_right:🏾పదో తరగతి విద్యార్థులు బాసర ట్రిపుల్‌ ఐటీ 2018-19 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలయింది. రాష్ట్రంలో ఏకైక రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యా లయం వెయ్యి సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది.
:point_right:🏾28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఇందులో ప్రవేశానికి ఈ నెల 28వతేదీ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఫలితాలతో సంబంధం లేకుండా పదో తరగతి హాల్‌టికెట్‌ నెంబర్‌తో దరఖాస్తు చేసుకోవచ్చును.
:point_right:🏾ప్రవేశ అర్హతలు
2018 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
:point_right:🏾రిజర్వేషన్లు
ట్రిపుల్‌ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గానూ 85 శాతం సీట్లు ఓపెన్‌ కేటగిరీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. రిజర్వేషన్ల ప్రకారం పరిశీలిస్తే ఎస్సీకి 15, ఎస్టీకి 5, బీసీ-ఏ- 7, బీసీ-బీ- 10, బీసీ-సీ 1, బీసీ-డీ 7, బీసీ-ఈ 4, దివ్యాంగులకు 3, క్రాప్‌ 2, ఎన్‌సీసీ 1, స్పోర్ట్స్‌ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. దీంతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు. అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ను పాటిస్తారు.
:point_right:🏾ప్రవేశ విధానం
పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వం నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 పాయింట్లను వచ్చిన పదోతరగతి గ్రేడ్‌కు జత కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. సీట్ల కేటా యింపు సమయంలో సమాన గ్రేడ్‌ పాయింట్లు ఉన్నట్టయితే మొ దట గణితం తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, తర్వాత సోష ల్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అయినా సమానమైతే పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్న వారికి అవకాశం ఇస్తారు.
:point_right:🏾ఫీజులు ఇలా..
ప్రవేశం పొందిన విద్యార్థులు ఐఐఐటీలో ఆరు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదటి రెండేళ్ల వార్షిక రుసుంగా రూ. 36వేలు ఆ తర్వాత మిగిలిన నాలుగు సంవత్సరాలకుగానూ వార్షిక రుసుం రూ. 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
:point_right:🏾ఉచిత సౌకర్యాలు
పేద విద్యార్థులు ఎవరైతే ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ పథకానికి అర్హులో వారికి విద్య, హాస్టల్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా ప్రభుత్వమే కల్పిస్తుంది.
:point_right:🏾కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన పత్రాలు
దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏవైతే సమర్పించారో కౌన్సిలింగ్‌లో అవి సమర్పించాల్సి ఉంటుంది. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, కాండక్ట్‌, టీసీ, మెమోతో పాటు రిజర్వేషన్‌ వర్తించే పత్రాలేమైనా ఉంటే అన్నింటినీ సమర్పించాలి.
:point_right:🏾దరఖాస్తు చేసుకోవాలిలా..
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా, టీఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 150 చెల్లించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200 ప్రవేశరుసుం చెల్లించాల్సి ఉంటుం ది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌ సెంటర్‌లోనే చెల్లించాలి. సెంటర్‌చార్జి అదనంగా రూ. 25 వసూల

ు చేస్తారు. ఈ నెల 28 నుంచి మే 24 వరకు దరఖాస్తుదారులు తమ సర్టిఫికెట్లను యూనివర్సిటీకి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల్ని 29లోగా చేరేట్లు చూడాలి. విద్యార్థుల ఎంపిక జాబితా జూన్‌లో విడుదల చేస్తారు. మొదటి కౌన్సిలింగ్‌ జూన్‌ 19, 20 తేదీల్లో, ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు జూన్‌ 22, 24, 27 తేదీల్లో చివరి దశ కౌన్సిలింగ్‌ జూన్‌ 29, 30 తేదీల్లో, కొత్త విద్యార్థులకు జులై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Tags :

Releted News

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, ఎం.ఫార్మశీ, ఎం.ఆర్క్‌ కోర్సులలో ప్రవేశాలు

10:13:00 | 05-May-2018
1555    0

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, ఎం.ఫార్మశీ, ఎం.ఆర్క్‌ కోర్సులలో ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ విధానంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరులలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మొదటిరోజు ఉదయం దివ్యాంగులకు, రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించను న్నట్టు అడ్మిషన్ల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.నరేంద్ర...

ఈ నెల 28 నుంచి ఇంటర్ పరీక్షలు

09:06:00 | 15-Feb-2018
1555    0

హైదరాబాద్: రాష్ట్రంలో పరీక్షల కాలం వచ్చేస్తుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను జరుగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇంటర్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి 9.25 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4.75 లక్షల మంది ఫస్టియర్, 4.50 లక్షల మంది సెకండియర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రైవేటు విద్యార్థులు 1.25 లక్షల మంది ఉన్నట్టు...

< 1 >