సుఖవ్యాధులు తో జాగ్రత్త...

06:39:00 | 11-Jan-2018
1555    0

హెచ్చరిక ..!ఎయిడ్స్‌ను‌ మించి‌ ప్రమాదకరంగా మారిన ఓ ‘సుఖవ్యాధి’..!ఆందోళనలో ప్రజలు …!

 

సెగవ్యాధి లేదా గనేరియా ఒక విధమైన అంటు వ్యాధి. ఇది నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక సామాన్యమైన సుఖ వ్యాధి అమెరికాలో దీనిది క్లమీడియా తర్వాత రెండవ స్థానం. సంభోగం లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్రమార్గం సన్నబడి కుంచించుకుపోవటం, మూత్ర మార్గానికి రంధ్రం పడి దానిలోంచి మూత్ర విసర్జన కావటం వంటి సమస్యలు ముంచుకొస్తాయి. అంతేకాదు.. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో పెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి. స్త్రీలల్లో పొత్తికడుపు నొప్పి, తెల్లమైల అధికం కావటం, నెలసరి క్రమం తప్పిపోవటం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి.

 

అనేక సాంక్రామిక సుఖవ్యాధుల్లో బాగా వణికించేది, ఒకసారి అటాక్ చేస్తే ఇక నయం కానిది ఎయిడ్స్… అఫ్ కోర్స్, కొన్ని హోమియో ప్రయోగాలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి, కానీ అల్లోపతి ఇప్పటికీ మందు కనుక్కోలేకపోయింది… కేవలం లైఫ్ ఎక్స్‌టెండ్ చేసే చికిత్సలు తప్ప..! అయితే ఇప్పుడు గనేరియా అనే సుఖవ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారుతున్నది… దీనికి కారణమయ్యే బ్యాక్టీరియా ‘సూపర్ బగ్‌’గా మారి మన మెడికల్ పరిశోధనలనే సవాల్ చేస్తున్నది…

 

ఏటా కోట్ల మందికి సోకుతున్న ఈ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా హెచ్చరించింది… ఒక్కముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు మార్కెట్‌లోని అన్ని మందులనూ హరాయించుకునే స్థితి.

Tags :

Releted News

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు

06:12:00 | 02-May-2018
1555    0

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే...

గుంటూరు నగరంలోని ఆసుపత్రులు, :ఫోన్‌ నంబర్లు

07:00:00 | 10-Mar-2018
1555    0

జీజీహెచ్‌ (ప్రభుత్వ సమగ్ర వైద్యశాల), రైల్వేస్టేషన్‌ ఎదురుగా, గుంటూరు. 0863 - 2220161 * ఎన్నారై జనరల్‌ ఆసుపత్రి, చినకాకాని, మంగళగిరి. ఫోన్‌ : 08645 - 236777 * గుంటూరు ఇ.ఎన్‌.టి. క్లినిక్‌ - (0863) 2324444, 98481 48082 * కీర్తి హాస్పటల్‌ - (0863) 3191555 * అమరావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌) - (0863)2256699, 2256688 * తులసీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ - (0863) 2323235, 2355559 * క్వాలిటీ హాస్పటల్‌ - (0863) 2264889 * వీణ హాస్పటల్స్‌ - (0863) 2220739 * హరికృష్ణ డయాబెటిక్‌ కేర్‌...

ఆరోగ్యమే మహాబాగ్యం...స్థూలకాయత్వానికి గురయ్యే ముందు బహిర్గతమయ్యే సంకేతాలు

10:56:00 | 06-Mar-2018
1555    0

స్థూలకాయత్వం అనేక వ్యాధులను కలిగించే మార్గంగా చెప్పవచ్చు. దీని వలన మధుమేహం, గుండె వ్యాధులు మరియు ఇతరేతర సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కానీ, :zzz: స్థూలకాయత్వానికి గురయ్యే ముందు కొన్ని లక్షణాలు సంకేతాలుగా బహిర్గతం అవుతాయి. వీటి గురించి తెలుసుకోవటం వలన తగిన జాగ్రత్తలను ముందు నుండే పాటించవచ్చు. :zzz: *నేను లావుగా ఉన్నానా?* :zzz: స్థూలకాయత్వం పరంగా,  ప్రపంచంలో రెండు రకాల మనస్తత్వాలు గల వ్యక్తులు ఉన్నారు, వారిలో-...

ఐఎంఏ ప్రొఫెసర్గా ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం

18:30:00 | 25-Nov-2017
1555    0

విజయవాడ: ప్రముఖ సెక్సాలజిస్ట్ గా తెలుగునాట ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సమరంకు ఇప్పుడు మరో మైలురాయి అధిగమించారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రొఫెసర్ గా ఆయన ఎంపికయ్యారు. కన్యాకుమారిలో జరిగిన ఐఎంఎ జాతీయ స్థాయి సమావేశం లో డాక్టర్ సమరం ను ఐఎంఏ ప్రొఫెసర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యరంగంలో డాక్టర్ సమరం అసాధారణ సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. వైద్యరంగంలో ఎన్నో అసాధారణ విజయాలు...

< 1 >