ఐఎంఏ ప్రొఫెసర్గా ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం

18:30:00 | 25-Nov-2017
1555    0విజయవాడ: ప్రముఖ సెక్సాలజిస్ట్ గా తెలుగునాట ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సమరంకు ఇప్పుడు మరో మైలురాయి అధిగమించారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రొఫెసర్ గా ఆయన ఎంపికయ్యారు. కన్యాకుమారిలో జరిగిన ఐఎంఎ జాతీయ స్థాయి సమావేశం లో డాక్టర్ సమరం ను ఐఎంఏ ప్రొఫెసర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యరంగంలో డాక్టర్ సమరం అసాధారణ సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. వైద్యరంగంలో ఎన్నో అసాధారణ విజయాలు నమోదు చేసిన డాక్టర్ సమరం అనేక పురస్కారాలను పొందారు.
ప్రముఖ సెక్సాలజిస్ట్
డాక్టర్ సమరం
డాక్టర్ సమరం విజయవాడ కేంద్రంగా కొన్ని దశాబ్దాల నుంచి విస్తృత వైద్య సేవలు అందించడంతో పాటు నాస్తిక కేంద్రం నిర్వహిస్తున్నారు.
అంతేకాదు వైద్యపరమైన విషయాలపై అవగాహనకు వారం వారం సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తున్నారు. ప్రజల్లో నెలకొనివున్న మూఢ నమ్మకాలు పారద్రోలడంతో డాక్టర్ సమరం అసమాన చొరవ కనబర్చారు.
సెక్సాలజిస్ట్ గా..
సెక్సాలజిస్ట్ గా పేరు ప్రఖ్యాతులు...
ప్రత్యేకించి సెక్స్ సంబంధిత సమస్యలపై అవగాహన లేక ఎన్నో రుగ్మతలకు గురవుతూ క్రుంగిపోతున్న వారిలో సమరం తెచ్చిన చైతన్యం అంతాఇంతా కాదు. తెలుగు గడ్డ మీద సెక్సాలజిస్ట్ గా సమరం పొందినంత పేరు ప్రఖ్యాతులు మరే వైద్యుడికి దక్కలేదంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.అందుకే ఐఎంఎ దేశవ్యాప్తంగా 195 మంది వైద్య ప్రముఖులను ప్రొఫెసర్లుగా ఎంపిక చేయగా, వారిలో డాక్టర్ జి. సమరం కూడా ఒకరు. వైద్యసేవలతో పాటు వైద్యవిద్యారంగంలో కూడా అసాధారణ ప్రతిభ కనబర్చిన వారిని ఐఎంఏ ప్రొఫెసర్లుగా ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైతే వాళ్లకు మూడేళ్ల పాటు ఈ పదవి ఉంటుంది. వారు వైద్య విద్య విషయంలో జాతీయ/ అంతర్జాతీయంగా ప్రాతినిథ్యం కలిగి ఉండటంతో పాటు ఐఎంఏలోను, సమాజంలో కూడా తమ నాయుకత్వ లక్షణాలను ప్రదర్శించి ఉండాలి. బోధన, అభ్యసన ఈ రెండు రంగాల్లోనూ వారు సాధించిన అసాధారణ విజయాల ఆధారంగా మాత్రమే ఈ ప్రొఫెసర్ పదవి ఇస్తారు. ఇది వచ్చిన వారు 'ప్రొఫెసర్' అన్న మాటను తమ లెటర్ హెడ్లు, విజిటింగ్ కార్డులలో ఉపయోగించుకోవచ్చు. సీఎంఈల నిర్వహణలో ఫ్యాకల్టీగా స్థానిక, రాష్ట్రస్థాయి బ్రాంచీలలో వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
బాధ్యత
బాధ్యత మరింత పెరిగింది
ఐఎంఏ ప్రొఫెసర్ గా ఎంపికవడంపై డాక్టర్ సమరం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐఎంఏ ప్రొఫెసర్ అన్న హోదా ఒక మంచి గుర్తింపు అని, ఈ హోదా రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని డాక్టర్ సమరం అన్నారు. వైద్యాన్ని కేవలం ఒక వృత్తిగా మాత్రమే కాకుండా సేవగా చూడాలని, ప్రజలకు వైద్యం చేయడానికే పరిమితం కాకుండా వాళ్ల శారీరక,మానసిక ఆరోగ్యపరమైన అంశాలపై కూడా అవగాహన పెంచడం వైద్యుల బాధ్యత అని డాక్టర్ సమరం ఈ సందర్భంగా చెప్పారు. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని, వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. ఐఎంఏ ప్రొఫెసర్ గా ఇప్పుడు తన పరిధి మరింత విస్తృతమైందని, బాధ్యత కూడా పెరిగిందని అన్నారు. వైద్యవిద్యాపరమైన విషయాల్లో మార్గదర్శకత్వం వహించాల్సిన అవసరం, సమయం వచ్చాయనేది తన భావన అన్నారు. ఇప్పటికే వైద్యవృత్తిలో ఉన్నవారికి రిఫ్రెషర్ కోర్సుల నిర్వహణ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వైద్యరంగంలో పరిశోధనలు ప్రోత్సహించడం, వాటికి గైడ్గా ఉండటం లాంటివి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
లక్ష్యాలు..
ఐఎంఏ ప్రొఫెసర్ గా లక్ష్యాలు..
ఐఎంఏ ప్రొఫెసర్ గా ఎంపికైన వారికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఐఎంఏకి విశ్వసనీయమైన, సమర్థవంతమైన ఫ్యాకల్టీని సిద్ధం చేయడం,
ఐఎంఏ విద్యాపరమైన కార్యకలాపాలను విస్తరింపచేయడం,ఐఎంఎ వనరులను ఐఎంఏ సదస్సులు/ వర్క్షాపులు/ సెమినార్లలో బోధన, వైద్యుల నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకోవడం, ఐఎంఏ స్థాయిలో వైద్యరంగంలో పరిశోధనల నిర్వహించడం, చికిత్సా ప్రమాణాలు పెంచడం, కాలానుగుణంగా నూతన నియమ నిబంధనలను రూపొందించడం, వైద్యుల ప్రత్యేకతల రంగంలో ఎప్పటికప్పుడు రివిజన్ చేయడం,
జాతీయ/ రాష్ట్ర స్థాయిలలో క్లినికల్ డేటా మేనేజ్మెంట్ రూపొందించడం...ఈ విధమైన బాధ్యతలు ఇమిడి ఉంటాయి. అయితే ఈ బాధ్యతలన్నింటిని డాక్టర్ సమరం సమర్థవంతంగా నిర్వర్తించగలరని వైద్య ప్రముఖులు కితాబు నిస్తున్నారు.

Tags :

Releted News

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు

06:12:00 | 02-May-2018
1555    0

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే...

గుంటూరు నగరంలోని ఆసుపత్రులు, :ఫోన్‌ నంబర్లు

07:00:00 | 10-Mar-2018
1555    0

జీజీహెచ్‌ (ప్రభుత్వ సమగ్ర వైద్యశాల), రైల్వేస్టేషన్‌ ఎదురుగా, గుంటూరు. 0863 - 2220161 * ఎన్నారై జనరల్‌ ఆసుపత్రి, చినకాకాని, మంగళగిరి. ఫోన్‌ : 08645 - 236777 * గుంటూరు ఇ.ఎన్‌.టి. క్లినిక్‌ - (0863) 2324444, 98481 48082 * కీర్తి హాస్పటల్‌ - (0863) 3191555 * అమరావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌) - (0863)2256699, 2256688 * తులసీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ - (0863) 2323235, 2355559 * క్వాలిటీ హాస్పటల్‌ - (0863) 2264889 * వీణ హాస్పటల్స్‌ - (0863) 2220739 * హరికృష్ణ డయాబెటిక్‌ కేర్‌...

ఆరోగ్యమే మహాబాగ్యం...స్థూలకాయత్వానికి గురయ్యే ముందు బహిర్గతమయ్యే సంకేతాలు

10:56:00 | 06-Mar-2018
1555    0

స్థూలకాయత్వం అనేక వ్యాధులను కలిగించే మార్గంగా చెప్పవచ్చు. దీని వలన మధుమేహం, గుండె వ్యాధులు మరియు ఇతరేతర సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కానీ, :zzz: స్థూలకాయత్వానికి గురయ్యే ముందు కొన్ని లక్షణాలు సంకేతాలుగా బహిర్గతం అవుతాయి. వీటి గురించి తెలుసుకోవటం వలన తగిన జాగ్రత్తలను ముందు నుండే పాటించవచ్చు. :zzz: *నేను లావుగా ఉన్నానా?* :zzz: స్థూలకాయత్వం పరంగా,  ప్రపంచంలో రెండు రకాల మనస్తత్వాలు గల వ్యక్తులు ఉన్నారు, వారిలో-...

సుఖవ్యాధులు తో జాగ్రత్త...

06:39:00 | 11-Jan-2018
1555    0

హెచ్చరిక ..!ఎయిడ్స్‌ను‌ మించి‌ ప్రమాదకరంగా మారిన ఓ ‘సుఖవ్యాధి’..!ఆందోళనలో ప్రజలు …!   సెగవ్యాధి లేదా గనేరియా ఒక విధమైన అంటు వ్యాధి. ఇది నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక సామాన్యమైన సుఖ వ్యాధి అమెరికాలో దీనిది క్లమీడియా తర్వాత రెండవ స్థానం. సంభోగం లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో...

< 1 >