Politics

వైఎస్ జగన్‌ వేస్తున్న ప్రతి అడుగు వైఎస్సార్‌సీపీ విజయం

18:15:00 | 13-May-2018
1555    0

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్టపాలనకు చరమగీతం పాడే విధంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సాగతోందని ఆపార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు అన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అని అంబటి పేర్కొన్నారు. నేడు వైఎస్ జగన్‌ వేస్తున్న ప్రతి అడుగు వైఎస్సార్‌సీపీ విజయాన్ని తెలియచేస్తుందని అన్నారు. ఈ నెల 14,15న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల...

కాంగ్రెస్‌కు 70సీట్లు కూడా రావు...

16:30:00 | 13-May-2018
1555    0

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికలు శనివారం ముగిశాయి. ఈనెల 15 వెలువడనున్న ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కూడా పార్టీ గెలుపుపై నమ్మకంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ ఐదేళ్లలో కాంగ్రెస్‌ వల్ల ప్రజలకు ఏ ప్రయోజనమూ చేకూరలేదు. రాష్ట్రం అవినీతిమయమైపోయింది. ఈ ఎన్నికల్లో విజయం మాదే. ఇప్పటికే నేను చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు...

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌

16:01:00 | 13-May-2018
1555    0

దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నకర్ణాటక ఎన్నికల ఫలితాల్లో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా నిలుస్తుందని దాదాపు అధికభాగం ఎగ్జిట్‌ పోల్స్ తేల్చేశాయి. ఈ నేపథ్యంలో దేన్నైయినా వ్యతిరేకించడానికి లేదా అంగీకరించడానికి తానిప్పుడు సిద్ధంగా లేనని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ చెప్పారు. మే15 వరకూ వేచి చూస్తే నిజమేంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. శనివారం కర్ణాటక ఎన్నికలకు పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన ఓటు హక్కును...

వైఎస్ జగన్ పై తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల

19:53:00 | 13-May-2018
1555    0

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ లాంటి రాక్షసుడు మరొకరు లేరని, జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అడ్డంగా భక్షిస్తారని ఆయన అన్నారు. జగన్ కు అధికారం ఇస్తే బిజెపికి తాకట్టు పెడుతారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేవలం ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు భక్షించిన జగన్ కన్నా మించిన రాక్షసుడు ఎవరుంటారని ఆయన అన్నారు.  తన కేసులను మాఫీ...

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ

12:30:00 | 13-May-2018
1555    0

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడి నియామకం జరిగింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే అధ్యక్ష రేసులో ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

బస్ యాత్ర గురించి తెలపనున్న పవన్ కళ్యాణ్

09:01:00 | 13-May-2018
1555    0

3 రోజు పాటు తిరుపతి లో బస చేయనున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్* ఈరోజు 10 గంటలకు స్వామి వారిని దర్శించుకొనున్న పవన్ కళ్యాణ్ సర్వ దర్శనానికి వెళ్లనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా ఇచ్ఛాపురం నుంచి బస్ యాత్ర ప్రారంభం కానునన్నట్లు సమాచారం ఈరోజు స్వామి వారి దర్శినం అంతరం బస్ యాత్ర గురించి తెలపనున్న పవన్ కళ్యాణ్

2019లో కూడా రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ విజయం...మంత్రి ఉమా

16:58:00 | 12-May-2018
1555    0

వచ్చే నెలలో దాములూరు-వైకుంఠపురం వరకు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. వంతెన నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సైకిల్ యాత్ర సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ, వచ్చే నెలలో మైలవరం...

రాప్తాడు నియోజకవర్గ మినీ మహానాడు ను విజయవంతం చేయండి... మంత్రి పరిటాల

16:03:00 | 12-May-2018
1555    0

తెలుగుదేశంపార్టీ శ్రేణులకు మహానాడు ఒక పండుగ లాంటిదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గ మినీ మహానాడు ను 15-05-2018 అనగా మంగళవారం ఉదయం 10.00 గం.లకు అనంతపురం, బళ్లారి రోడ్డులోని MYR కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలలో ఉన్న సభ్యులు, క్రియాశీల కార్యకర్తలు వారి సభ్యత్వ కార్డుతో హాజరు కావాలన్నారు....

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారానికి దూరం అవుతోందా,,,,

19:07:00 | 12-May-2018
1555    0

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్నే కోల్పోతూ వచ్చింది. గుజరాత్‌లోనే ఓటమి పాలైనా కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చిందని ప్రశంసలు పొందింది. ఇందులో రాహుల్‌గాంధీ పాత్ర కూడా ఉంది. కాంగ్రెస్‌ చేతిలో ఉన్న చివరి పెద్ద రాష్ట్రం కర్ణాటక. ఇది కూడా ఓడిపోతే రాహుల్‌ నాయకత్వం ప్రశ్నార్థకమవుతుంది.. అందుకే, రాహుల్‌ అహర్నిశలు కష్టపడ్డారు. ప్రయోగాలన్నీ ఫలించి కర్ణాటకలో కాంగ్రెస్‌...

‘మిషన్‌-150(సీట్లు)’ పేరుతో కమలనాథులు సాగించిన ప్రచారం

06:03:00 | 12-May-2018
1555    0

కర్ణాటకలో భాజపా రాజ్యాధికారాన్ని చేపడితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టు జాతీయ స్థాయిలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లోనూ మరింత బలోపేతమవుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్ని మరింత ధీమాతో ఎదుర్కొనడానికి అవకాశం చిక్కుతుంది. మోదీ నేతృత్వంలోే కమలనాథులు అప్రతిహత విజయాల్ని సాధిస్తున్నందున మళ్లీ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆయనతో స్నేహం చేసి.. లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొనే అవకాశాల్ని తోసి పుచ్చజాలం. ఒకవేళ కర్ణాటకలో ఓటమిపాలైతే మాత్రం జాతీయ స్థాయిలో...

దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

08:00:00 | 12-May-2018
1555    0

దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 224స్థానాలకు 58,008 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రతతో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగించారు. మొత్తం 2,984 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 5.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్‌బూత్‌లు 12వేలు, అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్‌బూత్‌లు 534 గా గుర్తించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు...

ఇన్నోవేషన్‌ వ్యాలీకి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ...ముఖ్యమంత్రి చంద్రబాబు

12:00:00 | 11-May-2018
1555    0

ఇన్నోవేషన్‌ వ్యాలీకి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చేందుకు కృషిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రారంభమైన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన మూడు నెలల్లోనే విద్యుత్‌ కొరత సమస్యను అధిగమించామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించిన మొదటి రాష్ట్రం...

< 5 6 7 8 9 10 11 12 13 >