ఎదురుమెండి దీవులు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా...ఎమ్మెల్యే సింహాద్రి

Will the opposite islands work for integrated development ... MLA Simhadri

eduru mondi mla simhadri

ఎదురుమెండి దీవులు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా...ఎమ్మెల్యే సింహాద్రి

అవనిగడ్డ నియోజకవర్గంలోని దీవి గ్రామాల సమూహమైన ఎదురుమొండి దీవులు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు అన్నారు.. గురువారం ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు మరియు దివి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కడవకొల్లు నరసింహారావు గారు ఎదురుమొండి దీవుల్లో పర్యటించారు.. బ్రహ్మయ్యగారిమూల, గొల్లమంద గ్రామాల నడుమ సముద్రపు ఆటుపోట్ల కారణంగా దాదాపు కిలోమీటరు మేర కోతకు గురయిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు మాట్లాడుతూ కృష్ణానది వరదలు, సముద్రపు ఆటుపోట్ల కారణంగా ఏర్పడిన కోత కారణంగా దీవులు ఉనికికే ప్రమాదం ఏర్పడిందని దీనిని నివారించేందుకు సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్రుష్టికి మరియు కలెక్టర్ నివాస్ గార్ల దృష్టికి తీసుకువెళ్లి శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. దాదాపు రూ. 4 కోట్లతో వేస్తున్న ఎదురుమొండి జింకపాలెం రహదారి పనులను పరిశీలించి 190 మీటర్ల మేర అటవీ భూమి కారణంగా ఏర్పడిన సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.

అనంతరం ఎదురుమొండిలో లిఖిత ఇన్ఫ్రా అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు విరాళంగా ఇచ్చిన భూమిలో నూతనంగా నిర్మించిన పీహెచ్సీ భవనాలను పరిశీలించి త్వరలో ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేయాలని సూచించారు..* *ఎదురుమొండి వారధి పనులు త్వరలో మొదలవుతాయని నాబార్డు నిధులతో ఈ వారధి నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే వెల్లడించారు.. అనంతరం పీహెచ్సీ సిబ్బందితోను, గ్రామస్తులతోను మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో తహసీల్దార్ విమలకుమారి, సీఐ భీమేశ్వర రవికుమార్, సర్పంచ్ కన్నా శుభ కీర్తన, మాజీ జడ్పిటీసీ కన్నా నాగరాజు, వైసీపీ నేతలు మోకా బుచ్చిబాబు, భోగాది శేషగిరిరావు, మద్ది చిన్నారి, ఎస్సై కుడిపూడి శ్రీనివాస్, సైకం లక్ష్మణ బాబు తదితరులు పాల్గొన్నారు.


Comment As:

Comment (0)