మైనారిటీ సంక్షేమ శాఖకు బదిలీ ఐన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ .ఎండి . ఇంతియాజ్

Krishna District Collector AMD Intiyaj transferred to Minority Welfare Department

Krishna District Collector AMD Intiyaj transferred to Minority Welfare Department

ప్రజలతో మమేకమైన కలెక్టర్ ఇంతియాజ్ : జిల్లాలో 3.30 లక్షల మంది కి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసారు.  ...రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని
     
        మైనారిటీ సంక్షేమ శాఖకు బదిలీ ఐన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ .ఎండి . ఇంతియాజ్ కు మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు.  
 
        రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలననుసరించి   ప్రజా సంక్షేమ పాలనను ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి ఇంతియాజ్ అని అన్నారు.  ఇంతియాజ్ గొప్ప మానవతావాదని,  చేస్తున్న  వృత్తిపట్ల అంకితభావం ఉన్న వారన్నారు.  కరోనా సమయంలో కూడా జిల్లాను అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో నడిపిన తీరు చెప్పుకోదగ్గదన్నారు.   పని తీరును, విజ్ఞానాన్ని విభిన్న కోణంలో  వక్తలు పేర్కొనడం జరిగిందన్నారు.  ఆయన సర్వీసులో ఎవరిపైనా కూడా రిమార్కు రాయని వ్యక్తి గా నిలిచి పోతారని పేర్కొన్నారు. అది ఇంతియాజ్ సమయంలో నే జిల్లా అధికారులు స్వేచ్ఛగా పనిచెయ్యడం చూసాను.  కలెక్టర్ గా కాకుండా ఒక స్నేహితుడిగా మిమ్మల్ని దూరం అవుతున్నారని ఫోనులో  తెలిపాను. ఎక్కడ ఉన్నా మీ పనితీరు ప్రతిబంభిస్తుందని పేర్కొన్నారు. ఇంతియాజ్ ఆధ్వర్యంలో మైనారిటీ శాఖ మరింత గా ఉన్నతస్థాయికి చేరుతారన్న  ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఇంతియాజ్ గారుతో పనిచేసిన వారికి అన్ని మంచి మధుర సృమతులే.  మానవ సంబంధాల ను కొనసాగించడం లో కలెక్టర్ సేవాగుణం దీర్ఘకాలం నిలిచిపోతుందన్నారు.  అధికారిని పక్కన పెడితే కలెక్టర్ ఇంతియాజ్ నుంచి భార్యను ఆప్యాయంగా చూసుకోవాలో ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి.ఆయన భార్యతో ఎలా వుండాలో పుస్తకం వ్రాయాలి.దానిని ప్రతి పురుషుడు ఆదర్శంగా తీసుకుంటాడు.  నేను ఈర్ష్య పడేది ఆయన కుటుంబంతో కొనసాగించే బాంధవ్యం  అన్నారు. తన విధి నిర్వహణ లో కూడా కుటుంబానికి చక్కటి తోడ్పాటు అందించి, మాకు ఆదర్శంగా, కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి గా నిండు కుండలా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎలా మంత్రులు పనిచేశారో అదే రీతిలో ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు రెండు ఏళ్లు పనిచేశారు.  ప్రజలకు సుపరిపాలనను అందిస్తున్నారన్నారు. 
        జిల్లా కలెక్టర్ ఏ .ఎండి .ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు , అధికార్లు, ప్రజల  సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో  అభివృద్ధి పధంలో నిలిపానన్నారు. జిల్లాలో 16 వేల మంది కి సచివాలయాలల్లో ఉద్యోగాలు ఇవ్వడం ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికీ, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లాలో ఎన్నికలు చక్కగా నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వేదికపై ఉండడం జీవితంలో ఒక్కసారే కలిగే అవకాశం నాకు రావడం అదృష్టం గా భావిస్తున్నాను. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, పథకాలు,  ప్రమాణ స్వీకారాలు నిర్వహించడం నా కు మరుపురాని సంఘటనలు, అవి నాకు సంతోషాన్ని నిచ్చాయి. కోవిడ్ సమయంలో టీం కృష్ణాతో కలసి పనిచెయ్యడం , వారి పనితీరు తృప్తిని నిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను భాదించిన అంశం ఏమిటంటే, క్లీనింగ్ ఆఫ్ కెనెల్స్, ప్లాస్టిక్ వినియోగంపై పోరాడుతున్న సమయంలో కోవిడ్ రావడం వల్ల అది పూర్తి చెయ్యకుండా ఉండడం అని తెలిపారు. నేను జాయిన్ ఐనా రోజు మస్కులు లేకుండా స్వాగతం పలికితే , ఈ అందరూ మాస్కులతో వీడ్కోలు పలకడం చాలా బాధగా ఉందన్నారు.

            శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, తొలిసారిగా శాసన సభ్యులు గా ఎన్నుకున్న మాకు మార్గదర్శకాలు ఇవ్వడమే కాకుండా, భీష్మనీతి ని పాటిస్తు మా వెనుక నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లాలని ఇచ్చిన మాట ను నూటికి నూరు శాతం అమలు పరిచిన వారిలో ఇంతియాజ్ ఒకరు.


           ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ, ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన ఇంతియాజ్ మంచి కలెక్టర్ గా సేవ అందించారు. రెండు సార్లు కోవిడ్ బారిన పడి కూడా, నిరంతరం కృషి చేస్తూ, మంచిమనసున్న వ్యక్తి గా నిలవడం అభినందనీయమన్నారు.  


      ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజా కలెక్టర్ గా ఇంతియాజ్ జిల్లా ప్రజలు చిరకాలం గుర్తిండి పోతారన్నారు. 


     ఎమ్మెల్సీ కరిమున్నిసా మాట్లాడుతూ కలెక్టర్ ఇంతియాజ్ మార్గదర్శకత్వం లో ప్రజా సమస్యలపై పరిష్కరించడంలో అందించిన సహకారాన్ని కి   ధన్యవాదాలు తెలిపారు.


         కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ  ఒక తండ్రిలా తనకు మార్గదర్శకం చేసి నా మదిలో చిరస్థాయిగా నిలిచారన్నారు. 


         ఎస్పీ ఎమ్. రవీంద్ర బాబు మాట్లాడుతూ, ఏదైనా సహాయం కోరితే ఆపని చెయ్యడం లో నిబద్ధత కలిగిన వ్యక్తిత్వం ఆయనది. కోవిడ్ సమయంలో రాష్ట్ర బోర్డర్లో ఏర్పడిన సంఘటన లను చాలా మృదువుగా పరిష్కరించడం లో ఇంతియాజ్ సూచనలు ఎంతో ఉపయుక్తంగా నిలిచాయి.


        జాయింట్ కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఏ పని చేసినా వెనకుండి ప్రోత్సాహం అందించారు.  హౌసింగ్ స్థలాలు కోసం ఎటువంటి అవాంతరాలు లేకుండా 4 వేల ఎకరాల భూ సేకరణ చెయ్యడం మీ వల్లే సాధ్యం అయిందన్నారు.  యువ అధికారులు కలెక్టర్ నుంచి ఓర్పు నేర్పు నేర్చుకోవాలన్నారు.


     జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ మాట్లాడుతూ, ఐ ఏ ఎస్ కు రాకముందు కమర్షియల్ టాక్స్ లో ఇంతియాజ్ గారితో పనిచేశాను. జాయింట్ కలెక్టర్ గా సచివాలయం వ్యవస్థ ఏర్పాటు సమయంలో తొలి నాళ్ళలో పనిచెయ్యడం ఒక ఛాలెంజ్ ఐతే, దానిని అధిగమించడం మీ వల్లే సాధ్యం అయిందన్నారు.


         సబ్ కలెక్టర్ హెచ్ ఎం ధ్యానచంద్ర మాట్లాడుతూ, మంచిగా నడిపిస్తూ మాకు మార్గదర్శకత్వం నిలిచిన వ్యక్తి ఇంతియాజ్. బదలీ ఉత్తర్వులు వొచ్చినా, పనితీరు లో ఎటువంటి నిర్లిప్తత లేకుండా పని చెయ్యడం కొందరికే సాధ్యం, అందులో కలెక్టర్ ఒకరు. వారి పనితీరు ను మేము అనుసారిస్తామన్నారు.

  అనంతరం జిల్లా కలెక్టర్ దంపతులను మంత్రి పేర్ని నాని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు.


Comment As:

Comment (0)