రాజానగరం నియోజకవర్గానికి రైతు బజార్లు, మార్కెటింగ్ కార్యాలయం రావడం తధ్యమని శాసనసభ్యులు ప్రకటన

Legislators have announced plans to set up farmer's markets and marketing offices in Rajanagaram constituency

jakkampudi raja mla

లాలాచెరువు, రాజానగరం, కోరుకొండ, సీతానగరం గ్రామాలకు రైతు బజార్లు - రాజానగరం శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు:
గుంటూరు లో వ్యవసాయం మార్కెటింగ్ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీ యమ్. శ్రీనివాస్ గారిని వారి కార్యాలయం లో కలసిన రాజానగరం శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు.
రాజానగరం నియోజకవర్గంలో వ్యవసాయం మార్కెటింగ్ అభివృద్ధికి సహకరించవలసిందిగా శాసనసభ్యులు కోరారు.
నియోజకవర్గంలో రైతు బజార్ల ఏర్పాటు, మార్కెటింగ్ కమిటీ కార్యాలయం నిర్మాణం అలాగే పలు విషయాలు మరియు సమస్యల పైన చర్చించారు.

లాలాచెరువు లో రైతుబజార్ ఏర్పాటు పనులు శరవేగముగా జరుగుచున్నది అని పర్యవేక్షక ఇంజనీర్ తెలుపగా శాసనసభ్యులు అక్కడే కాకుండా రాజానగరం, కోరుకొండ, సీతానగరం లో కూడా రైతుబజర్లు ఏర్పాటు చేయాలని, అలాగే ముఖ్యముగా నియోజకవర్గంలో మార్కెటింగ్ కార్యాలయం నిర్మాణం చేయాలని వీటికి అవసరమయిన స్థల సేకరణ శాసనసభ్యులు తన సహాయసహకారం అందిస్తానని తెలిపారు.

దీనికి పర్యవేక్షక ఇంజనీర్ దీనికి సంబందించి డి.పి.ఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) వెంటనే పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. రైతుబజార్ల ఏర్పాటు మరియు మార్కెటింగ్ కార్యాలయం నిర్మాణం పనులకు తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

రాబోయే రోజులలో రాజానగరం నియోజకవర్గానికి రైతు బజార్లు, మార్కెటింగ్ కార్యాలయం రావడం తధ్యమని శాసనసభ్యులు తన ప్రకటనలో పేర్కొన్నారు.


Comment As:

Comment (0)