కట్టుదిట్టంగా కర్ఫ్యూ నిబంధనలు కౌన్సెలింగ్ ఎస్ఐ డి సందీప్ & పోలీస్ సిబ్బంది

Strict curfew rules Counseling by SI D Sandeep & Police Staff

cerfew rules

అవనిగడ్డ : కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి విధించిన కర్ఫ్యూను  కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 11:30 గంటల నుంచే వ్యాపారస్తులను అప్రమత్తం చేస్తూ  12 గంటలకు అన్ని దుకాణాలను మూసి వేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రహదారిపై సంచరిస్తున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం తో పాటు జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసరమైతే నే కర్ఫ్యూ సమయంలో బయటకు రావాలని, నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ హెచ్చరించారు.


Comment As:

Comment (0)