మద్యం అక్రమాలపై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయండి..మంత్రి కొడాలి నాని ఆదేశం 

Kodali Nani Minister orders to strict vigilance on alcohol irregularities.

nani exsise ci

ఇసుక, మద్యం అక్రమాలపై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయండి - రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆదేశం 

గుడివాడ, జూన్ 22: ఇసుక, మద్యం అక్రమాలపై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ రాజేంద్రనగర్లోని ఇంటి దగ్గర మంత్రి కొడాలి నానిని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో గుడివాడ సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆర్బీ పెద్ధిరాజులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెద్దిరాజులు మాట్లాడుతూ స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో మైలవరం సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తూ బదిలీపై గుడివాడ సర్కిల్ కు వచ్చానని చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమాలకు చెక్ పెడుతూ సీఎం జగన్మోహనరెడ్డి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారని చెప్పారు.

Also read : రాష్ట్రంలో రైతుల కోసం అందుబాటు లోకి రానున్న 2531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు -మంత్రి కన్నబాబు

ఏపీలో మద్యం వినియోగాన్ని విడతల వారీగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జగన్మోహనరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 20 శాతం దుకాణాలను తగ్గించడంతో పాటు ధరలను కూడా పెంచడం జరిగిందన్నారు. గ్రామాల్లో 43 వేల బెల్ట్ షాపులను ఎత్తివేశారన్నారు. 4,300 పర్మిట్ రూంలను రద్దు చేసిందన్నారు. ఇంటిలిజెన్స్ , ఏసీబీ తరహాలో మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. గుడివాడ పట్టణ, రూరల్, పామర్రు, గుడ్లవల్లేరు మండలాల పరిధిలో ఉన్న ఎస్ఈబీ సర్కిల్ లో నాటుసారా, అక్రమ మద్యం విక్రయాలు, రవాణాపై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గుట్కా, గంజాయి విక్రయాలు, రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు.

Please do like and subscribe

youtube.com channel

facebook.com

web.telegram.org

janathamirror.blogspot.com

instagram.com


Comment As:

Comment (0)