CM Jaganmohan Reddy's actions for road construction in order of priority

nani10

ప్రాధాన్యతా క్రమంలో రోడ్ల నిర్మాణాలకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు 

గుడివాడ, ఆగస్టు 3: రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో రోడ్లను నిర్మించేందుకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఆర్.అండ్.బి  నిధులతో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం రూ. 47.02 కోట్ల నిధులను మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఆర్.అండ్.బి రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలో కూడా రోడ్ల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నామన్నారు. రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. అలాగే రూ. 16.10 కోట్ల వ్యయంతో గుడివాడ పట్టణంలో పెదకాల్వ సెంటర్ నుండి మందపాడు రైల్వేగేటు వరకు, గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారిని మండల కేంద్రమైన పెదపారుపూడి వరకు నిర్మిస్తున్నామన్నారు. రోడ్లను నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా నిర్మించడం జరుగుతుందన్నారు. రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద పంట, మురుగు కాల్వలు ఉన్న ప్రాంతాల్లో కొత్తగా నిర్మించే రోడ్లు పాడవకుండా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

 మున్సిపాలిటీలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ సమన్వయంతో రోడ్ల మరమ్మతులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రూ.2,205 కోట్ల వ్యయంతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ రోడ్లను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ఏడాది రూ. 417 కోట్లతో స్టేట్ హైవే రోడ్లు, రూ . 515 కోట్లతో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ పై వచ్చే సెసను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు ప్రభుత్వం మళ్ళించి రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.

2020-21 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి రూ. 410 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. వీటిలో రూ. 160 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి , ప్రాధాన్యతా క్రమంలో రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. నేషనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ అథారిటీ నిధులు రూ. 1,158.53 కోట్లతో రాష్ట్రంలో 99 స్టేట్ హైవేలు, 134 మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ సహకారంతో రాష్ట్రంలో రోడ్ల కనెక్టవిటీ పెంచుతున్నామన్నారు. మండలాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Pls do like subscribe Share comments like watch Pls support

subscribe janathamirror youtube channel

facebook page/janathamirrornews

janathamirror.blog

telegram Group

instagram/mirrorjanatha


Comment As:

Comment (0)